మీ ఫేస్బుక్ ఖాతా ను ఎవరైనా చూసారేమో తెలుసుకోవాలని ఉందా..?! అయితే ఇలా ట్రై చేయండి..!

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో ఫేస్ బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ లాంటి యాప్స్ ను అందరూ వినియోగిస్తూనే ఉంటారు.

అయితే ఎక్కువగా ఫేస్ బుక్ ఉయోగించడం మనం గమనిస్తూనే ఉంటాం.సాధారణంగా చాల మందికి  మన ఫేస్ బుక్ ప్రొఫైల్ ఎవరెవరు చూస్తున్నారోని తెలుసుకోవాలనే ఆలోచన కచ్చితంగా వచ్చి ఉంటుంది.

మనకు తెలియకుండా చాలామంది మన ప్రొఫైల్ ను చూసి ఉంటారు.అలాగే వివరాలను కనుక్కొని ఉంటారు వారు ఎవరో మనకు తెలియదు.

వాస్తవానికి మనం డైరెక్ట్ గా  ఫేస్ బుక్ లో మన ప్రొఫైల్ ఎవరు చూశారో తెలుసుకోవడానికి ఆప్షన్ మాత్రం లేదు.అదే ఐఫోన్ వినియోగించే వారైతే వారి ఫేస్ బుక్  ప్రొఫైల్ ఎవరు చూశారో ఈజీగా తెలుసుకోవచ్చు.

Advertisement

కేవలం వారి ప్రైవసీ సెట్టింగ్స్ లోకి వెళ్లి వారి ప్రొఫైల్ ని ఎవరెవరు చూసారో అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు.  ఈ అవకాశాన్ని ఫేస్ బుక్ సంస్థ వారు ఐఫోన్ వినియోగించే వారికి మాత్రమే కల్పించింది.

ఇందుకు ముందుగా ఐఫోన్ వినియోగించే వారు వారి ఫేస్ బుక్ లో "who viewed my profile" అనే ఆప్షన్ ను ఎంచుకుంటే చాలు ఎప్పటికప్పుడు వారి ప్రొఫైల్ ని  ఎవరెవరు వీక్షించారన్న విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు.అదే ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగించే వారు మాత్రం డెస్క్ టాప్ లో ఫేస్ బుక్ అకౌంట్ ని లాగిన్ అయి  తెలుసుకోవచ్చు.

ముందుగా హోమ్ బటన్ మీద క్లిక్ ఇచ్చి అందులో వ్యూ పేజ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది.మనకు సెర్చ్  అనే ఆప్షన్ కనపడుతుంది.అక్కడ  “BUDDY_ID" అని టైప్ చేస్తే.వెంటనే 15అంకెలు కలిగిన ఒక కోడ్  వస్తుంది ఆ కోడ్ ను కాపీ చేసుకొని కొత్త ట్యాబ్ లో facebook.com/profile ID (15-digit code)  అని సెర్చ్ చేస్తే వెంటనే మన ఫేస్ బుక్ పేజీని ఎవరైతే వీక్షించారన్న సులువుగా తెలుసుకోవచ్చు.

మరికొద్ది రోజుల్లోనే డైరెక్టుగానే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ అవకాశాన్ని కల్పించవచ్చని ఫేస్ బుక్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు