కొత్త‌గా కారు కొనాల‌ని అనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్‌..

కారు కొన‌డం అనేది ప్ర‌తి మిడిల్ క్లాస్ వారికి ఉండే ఒక పెద్ద క‌ల‌.

ఎందుకంటే డ‌బ్బులు ఉన్న వారికి అయితే ఇది చాలా కామ‌న్ గానీ డబ్బులు లేని వారికి అయితే ఇది పెద్ద యుద్ధ‌మ‌నే చెప్పాలి.

ఇక ఇప్పుడు కొత్తగా కారు కొనాల‌ని అనుకునే వారికి అయితే ఇప్పుడు కంపెనీలు ఎన్నో ఆఫ‌ర్లు ఇస్తున్నాయి.ఇక ప్ర‌జ‌లు కూడా పండుగల సంద‌ర్భంగానే కొనాల‌ని చూస్తుంటాయి.

ఎందుకంటే అప్పుడు అయితేనే మంచి ఆఫ‌ర్లు ఉంటాయ‌ని అంతా భావిస్తుంటారు.ఇక ఇప్పుడు కొత్త‌గా కారు కొనాల‌ని భావించే వారికి ఇప్పుడు ఓ మంచి గుడ్ న్యూస్ వ‌చ్చింది.

అదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్ప‌డు కార్ల‌మీద పెంచిన ట్యాక్సును కాస్తా దీపావళి పండగ వ‌ర‌కు త‌గ్గించే చాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.అయితే ఆ పండుగ‌కు ముందే ఈ డిసీష‌న్ తీసుకునా అవకాశం ఇప్ప‌టికే వార్త‌లు వ‌స్తున్నాయి.

Advertisement

ఇప్ప‌టికే పెరిగిన ట్యాక్సుల కార‌ణంగా వాహనాల‌ అమ్మకాలు దేశ వ్యాప్తంగా త‌గ్గిపోవ‌డంతో ప్ర‌భుత్వానికి భారీగా ఆదాయం త‌గ్గిపోతూ వ‌స్తోంది.దీంతో కేంద్రం కొత్త నిర్ణయం తీసుకోవచ్చని ఇప్ప‌టికే వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే దీపావళికి చాలామంది వాహ‌నాలు కొనే ఛాన్స్ ఉండ‌టంతో ఆలోపు నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.

కాగా ఇప్పుడున్న ట్యాక్సుల‌పై మోదీ ప్రభుత్వం గ‌న‌క సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని పన్ను తగ్గిస్తే మాత్రం వినియోగ దార్ల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది.ఎందుకంటే ఇప్పుడ‌న్న ధ‌ర‌ల కంటే కూడా చాలా త‌క్కువ‌కు కార్ల ధరలు దిగివస్తాయి.ప్ర‌స్తుతం ఇండియాలో ఈ కార్ల మీద ట్యాక్సు 37 నుంచి 38 శాతానికి చేరిందని తెలుస్తోంది.

ఇదు కార్ల‌మీద అయితే జర్మనీలో 19 నుంచి 20 శాతంవ‌కు అలాగే జపాన్‌లో కూడా కేవ‌లం 18నుంచి 22 శాతం వ‌ర‌కు మాత్ర‌మే ఉంది.అంటే త్వ‌ర‌లోనే ఈ కార్ల ధ‌ర‌లు మాత్రం త‌గ్గే చాన్ష్ ఉంద‌ని చెప్తున్నారు.

నేడు కేసీఆర్ బస్సు యాత్ర .. ఎక్కడ జరగబోతోందంటే ..? 
Advertisement

తాజా వార్తలు