తెలుగు సంవత్సరాది, మన ఉగాది రానే వస్తోంది.తెలుగు ప్రజలకు అసలైన కొత్త సంవత్సరం ఉగాదే.
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే ఈ ఉగాది పండుగను తప్పకుండా జరుపుకుంటారు.అమెరికాలో ఉన్న వంగూరి ఫౌండేషన్ ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా ఉగాది పర్వదినం పురస్కరించుకుని ముందు నుంచే అంతర్జాతీయ స్థాయిలో ఉగాది ఉత్తమ రచనల పోటీలను నిర్వహిస్తూ ఉంటుంది.
ఈ సంస్థ తమ సేవలను ప్రారంభించిన నాటి నుంచీ నేటి వరకూ నిర్విరామంగా ఉత్తమ రచనల పోటీలను నిర్వహిస్తోంది.ప్రస్తుతం 27 వ అంతర్జాతీయ ఉగాది ఉత్తమ రచనల పోటీలను నిర్వహిస్తోంది వంగూరి ఫౌండేషన్.
శుభకృత నామ సంవత్సర ఉగాది ని పురస్కరించుకుని రచనల పోటీలను ఏర్పాటు చేసినట్టుగా సంస్థ నిర్వాహకులు తెలిపారు.ఈ పోటీలలో రెండు విభాగాలు ఉంటాయి అవేంటంటే.ప్రధాన విభాగం, మొట్టమొదటి రచనా విభాగం.
ప్రధాన విభాగం:
భారత దేశంలోని తెలుగు వారు కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఎవరైనా సరే ఇందులో పాల్గొనవచ్చును.ఇందులో ఉత్తమ కధలకు రెండు బహుంతులు సమానంగా ఉంటాయి.ఉత్తమ కధలను గెలిచిన వారికి 116 USD అలాగే ఉత్తమ కవిత కి కూడా రెండు సమాన బహుమతులు ఉంటాయి ఇందులో గెలిచినా వారికి కూడా 116 USD డాలర్లు బహుమతులుగా అందిస్తారు.
మొట్టమొదటి రచనా విభాగం:
రచనలు, కవితలు రాయాలని అనుకున్నా, ప్రయత్నాలు చేసిన వారు ఎవరైనా వారి రచనలు ఎక్కడా ప్రచురించకుండా ఉంటే అలాంటి వారు తమ రచనలు తమకు పంపవచ్చునని అలాంటి వారికి ప్రోశ్చాహం అందించేందుకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేశామని సంస్థ తెలిపింది.ఇందులో కూడా మొట్ట మొదటి కధ, మొట్టమొదటి కవితా అనే విభాగాలు ఉంటాయని,విజేతలకు 116 USD డాలర్లు బహుమతులుగా అందిస్తామని తెలిపింది ఫౌండేషన్.
ఇదిలాఉంటే స్వీయ రచనలు మాత్రమే తీసుకోబడుతాయి, తమకు పంపే రచనలు, కవితలు ఎక్కడా ప్రచురించినవి కాకుండా ఉండాలి, ఇవి తాము స్వయంగా రాసి పంపినవి అని స్వీయ హామీ పత్రం రాసి ఇవ్వాలి.విజేతల వివరాలను ఉగాది పండుగ నాడు ప్రకటిస్తామని సంస్థ తెలిపింది.
తమ రచనలు పంపాల్సిన వారు మర్చి 15 -2022 లోగా తమ ఈ మెయిల్స్ కు పంపాలని ప్రకటించారు.