టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కలిసి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
అలాగే ఇందులో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కూడా కీలకపాత్రలో నటించాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన విషయం మనందరికీ తెలిసిందే.
ఇటీవలె సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

ఇకపోతే ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను పూర్తిచేసుకుని 2023లో తొలి హిట్ సినీమాగా నిలిచింది.జనవరి 13వ తేదీ విడుదల ఈ సినిమా విడుదల అయిన మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది.ఇక ఈ సినిమా విడుదల ఈ నేటికీ ఆరు రోజులు పూర్తిగా కావస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు మిలియన్ అమెరికన్ డాలర్స్ ను క్రాస్ చేసి ఔరా అనిపించింది.గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా 2మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన మూడవ సినిమాగా వాల్తేరు వీరయ్య సినిమా నిలిచింది.

ఈ సినిమా విడుదల అయ్యి ఆరు రోజులు పూర్తి కావస్తున్న కూడా ఈ సినిమా కోసం థియేటర్ లకు వచ్చే అభిమానుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.కాగా చిరంజీవి గత సినిమాలు అయినా ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి డిజస్టర్ లుగా నిలిచిన విషయం తెలిసిందే.దీంతో మెగా అభిమానులు చిరంజీవి తదుపరి సినిమా అయినా వాల్తేరు వీరయ్య పై భారీగా అంచనాలు పెట్టుకోగా అదే అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హిట్టు టాక్ ను సొంతం చేసుకుంది.
బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల సునామిని సృష్టిస్తోంది.కాగా ఈ సినిమా మొదటిరోజు దాదాపుగా 1545 స్క్రీన్ లో విడుదలైన విషయం తెలిసింది.అలాగే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ.29.30 కోట్లు రాబట్టింది.ఇక రెండవ రోజు రూ.14.60 కోట్లు, మూడవరోజు రూ.15.01 కోట్లు, నాలుగవ రోజు 14.77 కోట్లు, ఐదవ రోజు రూ.9.85 కోట్లు ఆరవ రోజు రూ.7.88 కోట్ల వసూళ్లను సాధించింది.







