వాల్ న‌ట్స్ ఇలా తింటే థైరాయిడ్ స‌మ‌స్య‌ దూరం?

థైరాయిడ్.నేటి కాలంలో చాలా మందిని ఈ స‌మ‌స్య వేధిస్తోంది.

ముఖ్యంగా స్త్రీల‌లో ఎక్కువ‌గా క‌నిపించే ఈ థైరాయిడ్‌లో రెండు రాకాలు ఉన్నాయి.

అందులో ఒక‌టి హైపో థైరాయిడిజం కాగా.

మ‌రొక‌టి హైపర్‌ థైరాయిడిజం.థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే ఎక్కువగా హార్మోన్‌ను విడుదల చేస్తే అది హైప‌ర్ థైరాయిడిజం అని.త‌క్కువ హార్మోన్‌ను విడుద‌ల చేస్తే అది హైపో థైరాయిడిజం అని అంటారు.అయితే దాదాపు అంద‌రిలోనూ హైపో థైరాయిడిజమే క‌నిపిస్తుంది.

చాలా రేర్‌గానే హైప‌ర్ థైరాయిడ్ కేసులు ఉంటాయి.ఇక థైరాయిడ్ ఉంటే గ‌నుక అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

Advertisement

త‌ర‌చూ నీర‌సం, అధిక బ‌రువు, కండ‌రాలు నొప్పులు, ఆక‌లి లేక‌పోవ‌డం, మ‌ల‌బ‌ద్ధ‌కం, హెయిర్ ఫాల్‌, నెల‌స‌రి స‌మ‌స్య‌లు, ఒత్తిడి ఇలా అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.అందుకే థైరాయిడ్ హార్మోన్‌ను కంట్రోల్‌లో పెట్టుకోవ‌డం చాలా అవ‌స‌రం.

అయితే కొన్ని కొన్ని ఆహారాల ద్వారా అది సాధ్యం అవుతుంది.ముఖ్యంగా వాల్ న‌ట్స్ మ‌రియు తెనెను క‌లిపి తీసుకుంటే.

థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్‌లో ఉంటుంద‌ని అంటున్నారు నిపుణులు.

అదెలా అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది.అక్క‌డికే వ‌స్తున్నా.ఆగండి.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

నిజానికి థైరాయిడ్‌ గ్రంథికి తగు పాళ్లలో అయోడిన్‌ అందాలి.ఆ అయోడిన్ త‌గ్గితే హైపో థైరాయిడ్ స‌మ‌స్య త‌లెత్తుతుంది.

Advertisement

అయితే అయోడిన్ త‌గ్గడానికి ప్ర‌ధాన కార‌ణం సెలీనియం స్థాయి తక్కువగా ఉండ‌ట‌మే.అంటే, సెలీనియం పుష్క‌లంగా ఉండే ఆహారాన్ని మ‌నం తీసుకోవాలి.

అయితే వాల్ న‌ట్స్‌లో సెలీనియం పుష్క‌లంగా ఉంటుంది.ఈ సెలీనియం థైరాయిడ్ గ్రంథి ప‌ని తీరును మెరుగు ప‌ర‌చ‌డంతో పాటు థైరాయిడ్ హార్మోన్ హెచ్చుతగ్గులుండకుండా చూస్తుంది.

ఇక తేనెలో కూడా బోలెడ‌న్ని పోష‌కాలు నిండి ఉన్నాయి.తేనె కూడా థైరాయిడ్ స‌మ‌స్య‌ను అర‌క‌ట్ట‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

కాబ‌ట్టి, వాల్ న‌ట్స్‌ను తేనెలో నాన‌బెట్టి.ప్ర‌తి రోజు తీసుకుంటే థైరాయిడ్ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

ఇక వాల్ న‌ట్స్‌నే కాకుండా జీడిపప్పు, బాదం ప‌ప్పు, బ్రెజిల్ నట్స్ వంటి వాటిని కూడా తేనెలో నాన బెట్టి తీసుకోవ‌చ్చు.ఇవి కూడా థైరాయిడ్ గ్రంథి ప‌ని తీరును మెరుగుప‌ర‌చ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

తాజా వార్తలు