'లైగర్' నుండి మరో సాలిడ్ వీడియో.. రౌడీ స్టార్ మాస్ యాటిట్యూడ్ కి ఫ్యాన్స్ ఫిదా!

యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోగా అంతకంతకు ఎదుగుతున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.

విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.

ఆయన ప్రతి ఒక్కరికి ఫేవరేట్ హీరోగా మారి పోతున్నాడు.ప్రెసెంట్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా మరొక నెల రోజుల్లో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నాడు.

ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.మొదటి సారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు విజయ్ ఇంకా పూరీ.

ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విజయ్ మరింత స్టార్ డమ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు.ఇక రిలీజ్ కూడా దగ్గర పడడంతో మేకర్స్ ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా విశేష స్పందన లభించింది.లైగర్ కు మాస్ ప్రేక్షకుల్లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో అనేది ట్రైలర్ తోనే తేలిపోయింది.

ఈ ట్రైలర్ కూడా యూట్యూబ్ లో భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ రికార్డులను బద్దలు కొడుతోంది.ఈ క్రంమలోనే ఈ సినిమా నుండి మరొక వీడియో రిలీజ్ చేసారు పూరీ.

ప్రొమోషన్స్ లో భాగంగా మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మరొక మాస్ వీడియో విడుదల చేసారు.

మిక్స్ సాంగ్ లా విజయ్ డైలాగ్స్ తోనే అదర గొట్టాడు.ఈయన మాస్ యాటిట్యూడ్ కి ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు.వాట్ లగా దేంగే అంటూ రిలీజ్ చేసిన ఈ సాలిడ్ మాస్ వీడియో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై క్రేజ్ పెంచేసాయి.

కీళ్ల నొప్పుల నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ వ‌ర‌కు ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

ఇక ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.

Advertisement
https://youtu.be/3ZxUJNUCeok

తాజా వార్తలు