సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) తెరకెక్కించిన ‘వ్యూహం’( Vyuham ) చిత్రంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ తో పాటు రికార్డులను సెన్సార్ బోర్డ్ కోర్టుకు సమర్పించింది.
ఈ క్రమంలో రికార్డులను పరిశీలించిన తరువాత విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.అదేవిధంగా ఈ పిటిషన్ పై న్యాయస్థానం రేపు మరోసారి వాదనలు విననుంది.
ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) రేపటికి వాయిదా వేసింది.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు,( Chandrababu ) ఆ పార్టీ నేత లోకేశ్ తో( Lokesh ) పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను( Pawan Kalyan ) కించ పరిచే విధంగా సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని పేర్కొంటూ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.దీంతో ఈ నెల 11వరకు సినిమా విడుదలను నిలిపివేస్తూ కొద్ది రోజుల కిందట సింగిల్ బెంచ్ ఉత్తర్వులను జారీ చేసింది.ఈ ఉత్తర్వులను చిత్ర బృందం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.







