Lakshmi Prasanna : ముంబైలో మంచు లక్ష్మి లగ్జరీ ఇల్లు చూస్తే షాకవ్వాల్సిందే.. ఇంద్ర భవనమే అంటూ? 

మంచు వారసురాలు లక్ష్మీ ప్రసన్న( Lakshmi Prasanna ) ఇన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం తన కూతురు భవిష్యత్తు కోసం అలాగే తన సినీ కెరియర్ గురించి ఆలోచన చేసి ఈమె ముంబైకి( Mumbai ) షిఫ్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే.తెలుగులో ఇప్పటికే పలు విభిన్న పాత్రలలో నటించినటువంటి మంచు లక్ష్మి బాలీవుడ్ ( Bollywood ) ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

 Mumbai Manchu Lakshmi Luxury House Video Viral On Internet-TeluguStop.com

అక్కడ ఈమె సినిమాలలోను వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.

ఇక మంచు లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.ఇదివరకు ఈమె తిరుపతిలో ఉంటున్నటువంటి తన ఇంటితో పాటు హైదరాబాదులో ఉన్న ఇల్లు అలాగే తన తండ్రి మోహన్ బాబు( Mohan Babu ) ఇంటిని కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.తాజాగా ఈమె ముంబైలో తాను ఉంటున్న ఇంటికి సంబంధించిన వీడియోని అభిమానులతో పంచుకున్నారు.

దాదాపు వారం రోజులపాటు 28 ఫ్లాష్ చూసానని అయితే ఫైనల్ గా తాను ఇప్పుడున్నటువంటి ఫ్లాట్ నాకు నచ్చడంతో తీసుకున్నానని లక్ష్మీ ప్రసన్న వెల్లడించారు.ఇలా తాను ఉన్న ఇంటిలో తన రూమ్ ఫర్నిచర్ సిట్టింగ్ ఏరియా ఇలా అన్నింటినీ వీడియో రూపంలో ఆమె అందరికీ తెలియజేశారు.ఇక ఈ ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు అన్నింటిని కూడా చాలా వరకు హైదరాబాద్ నుంచి ఆమె తీసుకొచ్చారని తెలుస్తోంది.ఇలా మంచు లక్ష్మి ముంబైలో ఉన్న ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ వీడియో ( Home tour video ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తాను స్టార్ కిడ్ కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కాదని ఇక్కడ నేనేంటో నిరూపించుకొని సినిమా అవకాశాలను అందుకోవాల్సి ఉంటుందని ఈమె తెలిపారు.అయితే కొంతమంది తనని ఆడిషన్స్ కి రమ్మని ఫోన్ కాల్స్ చేస్తున్నారని ఈమె తెలిపారు.

https://youtu.be/9Q0-od4yjSw?si=qQX5-MLwrOepYEp9
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube