కెన్నెడీ సెంటర్‌పై ట్రంప్ పెత్తనం .. జేడీ వాన్స్ దంపతులకు నిరసన సెగ

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన దూకుడు నిర్ణయాలతో ప్రపంచానికి షాకిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.

( Donald Trump ) అక్రమ వలసదారులు, ఇమ్మిగ్రేషన్, వీసా నిబంధనలు, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ఇలా అన్నింటిలో ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

పలు అంశాలలో అప్పుడే ట్రంప్ నిరసనను ఎదుర్కొంటున్నారు.తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్,( JD Vance ) ఆయన సతీమణి భారత సంతతికి చెందిన ఉషా వాన్స్‌లకు( Usha Vance ) నిరసన సెగ ఎదురైంది.

గురువారం రాత్రి ఓ మ్యూజిక్ కన్సెర్ట్‌లో పాల్గొనేందుకు కెన్నెడీ సెంటర్‌కు( Kennedy Center ) చేరుకున్న వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.

వాన్స్ దంపతులు బాల్కనీ సీటింగ్‌లోకి రాగానే ప్రేక్షకులు నినాదాలు చేశారు.జానపద సంగీతకారులు నోరా బ్రౌన్, స్టెఫానీ కోల్‌మన్‌ల ప్రదర్శనను వీక్షించేందుకు వాన్స్ దంపతులు హాజరయ్యారు.

Jd Vance And His Wife Usha Brutally Booed At The Kennedy Center After Trump’s
Advertisement
JD Vance And His Wife Usha Brutally Booed At The Kennedy Center After Trump’s

ట్రంప్ - వాన్స్‌లు పాలనా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కెన్నెడీ సెంటర్ వద్ద ఉద్రిక్తతలకు కారణంగా తెలుస్తోంది.ఈ ఏడాది ప్రారంభంలో కెన్నెడీ సెంటర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను తొలగించి తనను తాను ఛైర్మన్‌గా నియమించుకున్నారు డొనాల్డ్ ట్రంప్.వాషింగ్టన్ డీసీలోని కెన్నెడీ సెంటర్‌ను మళ్లీ గొప్పగా చేయబోతున్నామని .కళలు, సంస్కృతిలో అమెరికా స్వర్ణయుగం కోసం ట్రస్టీలను బోర్డు నుంచి వెంటనే తొలగించాలని నిర్ణయించుకున్నామని ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో ప్రకటించారు.

Jd Vance And His Wife Usha Brutally Booed At The Kennedy Center After Trump’s

ఆ వెంటనే ట్రంప్ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అలెగ్జాండర్ హామిల్టన్ నాటక నిర్మాతలు తీవ్రంగా మడిపడ్డారు.హామిల్టన్‌కు టోనీ, గ్రామీ, పులిట్జర్ బహుమతి సహా అనేక అవార్డులు వచ్చాయి.

కెన్నెడీ సెంటర్‌పై రుద్దుతున్న ఈ కొత్త సంస్కృతిలో భాగం కావడానికి వీల్లేదని నిర్మాత జెఫ్రీ సెల్లర్ అన్నారు.ట్రంప్ ఇటీవలే ఫాక్స్ న్యూస్ యాంకర్‌లు లారా ఇంగ్రాహం, బార్టిరోమోలను కెన్నెడీ సెంటర్‌లోని 33 మంది సభ్యుల ట్రస్టీల బోర్డులో నియమించారు.

ఆఫ్రికాలో ఇండియన్ వ్లాగర్ మ్యాజిక్.. ముర్సి తెగ వారికి 'పరదేశీ జానా నహీ' నేర్పించి షాక్!
Advertisement

తాజా వార్తలు