సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతూ ఉంటారు.వారు ఉపయోగించే చిన్న చిన్న వస్తువుల నుంచి మొదలుకొని ఉండే బంగ్లాలు తిరిగే కార్లు కూడా చాలా ఖరీదైనవి ఉంటాయి.
ఇలా వారి లగ్జరీ లైఫ్ కోసం కొన్ని కోట్లు ఖర్చు చేస్తూ ఉంటారు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ఎన్టీఆర్ ( NTR ) ఒకరు.
ఎన్టీఆర్ కూడా అన్ని బ్రాండెడ్ వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు.ముఖ్యంగా ఎన్టీఆర్ కు చేతి వాచ్ ( NTR Wrist Watch ) అంటే ఎంతో ఇష్టం అందుకే కోట్లు ఖరీదు చేసి ఎన్నో బ్రాండ్లకు సంబంధించిన వాచెస్ కొనుగోలు చేశారు.

ఇకపోతే ఇటీవల ఎన్టీఆర్ కి సంబంధించి ఒక లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఒక యాప్ ప్రమోషన్ వీడియోలో ఎన్టీఆర్ విభిన్నమైన లుక్ కనిపించడంతో ఎంతోమంది ఎన్టీఆర్ లుక్ పై విమర్శలు చేశారు.అయితే ఈ యాడ్ వీడియో వచ్చిన రెండు రోజులకే ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించారు.ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ ను ఈ లుక్ లో చూసి విమర్శించిన వారు సైతం షాక్ అవుతున్నారు.

ఇక ఎన్టీఆర్ ఈ లుక్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చేతికి కట్టుకున్న వాచ్ కూడా అందరిని ఆకర్షించింది.దీంతో ఎన్టీఆర్ చేతికి ధరించిన వాచ్ ఖరీదు( Watch Price ) ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఎన్టీఆర్ పెట్టుకున్న ఈ వాచ్ రీఛార్జ్ 40 – 01 టర్బైన్ మెకలర్.స్పీడ్ టైల్ బ్రాండ్ కు చెందినది.ఈ వాచ్ విదేశాల నుండి ఎక్స్ ప్లోడ్ చేశారు.అన్ని పన్నులు చెల్లించిన తర్వాత.దాదాపు రూ.8 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని తెలుస్తోంది.ఇలా వాచ్ కోసం 8 కోట్లు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు ఈ డబ్బుతో సిటీలో పెద్ద బంగ్లా కొనుగోలు చేయొచ్చు అంటూ అభిమానులు భావిస్తున్నారు అయితే ఎన్టీఆర్ కదా ఇలా ఖరీదైన వాచ్ కలెక్షన్స్ చాలా ఉందనే చెప్పాలి.