Buggana Rajendranath : ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly ) కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు.ప్రస్తుతం ఐదో సారి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న మంత్రి బుగ్గన మొత్తం రూ.2 లక్షల 85 వేల కోట్లతో బడ్జెన్ ను రూపొందించారు.అలాగే గత ఏడాది ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.2 లక్షల 79 వేల కోట్లన్న సంగతి తెలిసిందే.బడుగు, బలహీనవర్గాలకు వైసీపీ ( YCP )ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన తెలిపారు.అలాగే విద్య, వైద్యం, మహిళ సాధికారితకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

 Vote On Account Budget In Ap Assembly-TeluguStop.com

2024 బడ్జెట్ రూ.2 లక్షల 86 వేల 389 కోట్లని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ( Buggana Rajendranath )పేర్కొన్నారు.రాష్ట్ర ఆదాయ వ్యయం అంచనా రూ.2 లక్షల 30 వేల 110 కోట్లు కాగా మూల ధన వ్యయం రూ.30 వేల 530 కోట్లు, అంచనా రెవెన్యూ లోటు రూ.27,758.22 కోట్లు, ద్రవ్యలోటు రూ.55,817.50 కోట్లుగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube