టాలీవుడ్ దర్శకుడు సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప.గతంలో విడుదల అయిన పుష్ప పార్ట్ 1 కి సీక్వెల్ గా ఇప్పుడు పార్ట్ 2 రూపొందుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం పుష్ప 2 కి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఆ వార్తలు సినిమా పై అంచనాలను మరింత పెంచడంతోపాటు ఎన్నో రకాల అనుమానాలకు కూడా తావిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.పుష్ప సినిమా వెండితెర వెబ్ సిరీస్ అయ్యేలా ఉంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది కేవలం రెండు భాగాలతో ఆగేలా లేదట.ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న సెకండ్ పార్ట్ తర్వాత చివరి ఘట్టాన్ని ది రోర్ పేరుతో కంప్లీట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాధమికంగా బన్నీ, సుక్కు, మైత్రి అధినేతలు ఓకే అనుకున్నారట.ఎలాగైనా ఆగస్ట్ 15 విడుదల తేదీని మిస్ కాకూడదనే కృత నిశ్చయంతో నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుతూనే ఉన్నారు.
సుకుమార్ గతంలోనే దీన్నో వెబ్ సిరీస్ కు సరిపడా లెన్త్ తో రాసుకున్నానని, కానీ బన్నీకి నచ్చాక సినిమా నిడివికి తగ్గట్టు మార్చానని చెప్పుకుంటూ వచ్చారు.

అయితే ఫ్రెష్ గా అవుట్ ఫుట్ చూసుకున్నాక దీన్ని మరింత విస్తరించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.మూడేళ్లుగా బన్నీ దీని కోసమే పొడవాటి జుత్తుని కష్టపడి మైంటైన్ చేస్తున్నాడు.భవిష్యత్తులో పుష్ప 3 చేయాలన్నా మళ్ళీ ఇంత స్థాయిలో పెంచడం చాలా కష్టం.
పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ వంగా, అట్లీలతో( Trivikram Srinivas, Sandeep Vanga, Atlee ) ప్రోజెక్టులకు అనుగుణంగా మేకోవర్ కావాల్సి ఉంటుంది.సో ఏది చేసినా ఇప్పుడే చేయాలి.
అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు ఇస్తారో వేచి చూడాలి మరి.జపాన్ ఎపిసోడ్, జాతరలో బన్నీ చీర కట్టుకుని చేసే ఫైట్, థియేటర్ యాక్షన్ బ్లాక్ ఇవన్నీ ది రూల్ లో ఒక రేంజ్ లో పేలతాయట.ఫహద్ ఫాసిల్ అల్లు అర్జున్ మధ్య క్లాష్ ని మూడో భాగంలోనే ఎక్కువగా చూసే అవకాశం ఉండొచ్చని తెలిసింది.ఇప్పటిదాకా పరిచయం కాని ఎన్నో కొత్త పాత్రలు ఎంట్రీ ఇస్తాయని కూడా అంటున్నారు.
అంతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పుష్ప 3 కూడా ఉంటుందని, మరో మూడేళ్ల పాటు అల్లు అర్జున్ పరిమితం అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.







