వివో T3x 5G స్మార్ట్ ఫోన్( Vivo T3X 5G Smartphone ) సరికొత్త ఫీచర్లతో భారత మార్కెట్లో ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం లాంచ్ అవ్వనుంది.ఫ్లిప్ కార్ట్ మైక్రో సైట్ ప్రకారం ఈ ఫోన్ ధర భారత మార్కెట్లో రూ.15 వేలలోపు ఉండనుంది.ఇప్పటికే ఈ ఫోన్ ఫీచర్లను కంపెనీ రివిల్ చేసేసింది.
ఈ ఫోన్ డిజైన్ తో పాటు ఫీచర్ల గురించి తెలుసుకుందాం.వివో T3x 5G స్మార్ట్ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్ ప్లే తో వస్తోంది.క్వాల్కం స్నాప్ డ్రాగన్ 6జెన్ 1 చిప్ సెట్ తో వస్తుంది.6000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 44W ఫాస్ట్ ఛార్జింగ్( Fast Charging ) కు మద్దతు ఇవ్వనుంది.ఈ స్మార్ట్ ఫోన్ పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లతో వస్తుంది.
డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ తో వస్తుంది.ఈ ఫోన్ 0.79 సెంటీమీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ వెనుక వైపు పెద్ద సర్క్యులర్ కెమెరా మాడ్యూల్( Circular Camera Module ) తో ఉంటుంది.ఇందులో రెండు కెమెరాలు, LED ఫ్లాష్ యూనిట్ ఉన్నాయి.ఫోన్ కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్లు ఉన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్ 4GB, 6GB, 8GB RAM వేరియంట్ ఆప్షన్ లలో లభించనుంది.స్టోరేజ్ మాత్రం 128GB తో ఉంటుంది.
ఈ ఫోన్ కెమెరా( Camera Features ) విషయానికి వస్తే.50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ తో ఉంటుంది.వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఉంటుంది.ఈ ఫోన్ రెడ్, గ్రీన్ అని రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.
ఇక ఈ ఫోన్ కు సంబంధించిన మిగతా వివరాలు లాంచింగ్ సమయంలో తెలియనున్నాయి.