నిశ్చితార్థం చేసుకున్న వైవా హర్ష.. కాబోయే భార్య ఎవరంటే..?

వైవా అనే షార్ట్ ఫిలిం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో హర్ష తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు .

వైవా షార్ట్ ఫిలిం ద్వారా వచ్చిన గుర్తింపు వల్ల హర్షకు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో పాటు సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి.

హర్ష కమెడియన్ గా తెరకెక్కి గతేడాది ఆహా ఓటీటీలో విడుదలైన కలర్ ఫోటో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు అతని కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయింది.ఇకపోతే ఇప్పటివరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న హర్షకు పెళ్లి ఫిక్స్ అయింది.

నిన్న హర్ష నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.హర్ష వివాహం చేసుకోబోయే యువతి పేరు అక్షర అని సమాచారం.

ఈమెకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను హర్ష ఫేస్ బుక్ స్టోరీస్ లో యాడ్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

నిశ్చితార్థ వేడుకలో కాబోయే భార్య మెడలో దండ వేయడంతో పాటు ఆమెతో కలిసి కేక్ కట్ చేశారు.పెళ్లి, నిశ్చితార్థ వేడుకలకు మరో నాలుగు నెలల పాటు మంచి మూహూర్తాలు లేకపోవడంతో చాలామంది సెలబ్రిటీల వివాహాలు, నిశ్చితార్థ వేడుకలు గత కొన్ని రోజుల్లో జరిగాయి.అయితే వైవా హర్ష పెళ్లి తేదీ ఎప్పుడనే విషయం తెలియాల్సి ఉంది.

వైవా హర్ష, అక్షర కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య నిశ్చితార్థ వేడుక జరిగింది.వైవా హర్ష నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుండగా హర్షకు యూట్యూబర్లు, ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మే 14వ తేదీ తరువాత మంచి మూహుర్తాలు ఉండటంతో మే నెలలో హర్ష అక్షర వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు