ఆకట్టుకున్న విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' మోషన్ పోస్టర్..!

కరోనా టైం లో కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా ఓ మై కడవులే అందరిని అలరించింది.ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు ప్రముఖ నిర్మాత పివిపి.

 Viswak Sen Ori Devuda Motion Poster Released , Dil Raju , Latest Movie News , O-TeluguStop.com

దిల్ రాజు సహకారంతో పివిపి బ్యానర్ లో ఓ మై కడవులే తెలుగు వర్షన్ వస్తుంది.ఈ సినిమాకు ఓరి దేవుడా టైటిల్ ఫిక్స్ చేశారు.

విశ్వక్ సేన్, మిథిల పాల్కర్, ఆశా భట్ నటిస్తున్నారు.సినిమా నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ లో విశ్వక్ సేన్ అలరించాడు.సెలక్టెడ్ సినిమాలతో యువ హీరోల్లో తనకంటూ ఒక స్పెషాలిటీ ఉండేలా చేసుకుంటున్నాడు విశ్వక్ సేన్.

ఈమధ్యనే పాగల్ అంటూ వచ్చి ఆడియెన్స్ ను అలరించిన విశ్వక్ సేన్ లేటెస్ట్ గా ఓరి దేవుడా అని వస్తున్నాడు.తమిళ వర్షన్ లో దేవుడి రోల్ లో విజయ్ సేతుపతి గెస్ట్ రోల్ చేశారు.

మరి ఓరి దేవుడాలో దేవుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది.ఆల్రెడీ హిట్టైన సినిమా కాబట్టి తెలుగులో కూడా అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని చెప్పొచ్చు.

ఓరి దేవుడా పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube