కమల్ హస్సన్ నటించిన విశ్వరూపం - 2 హిట్టా.? స్టోరీ, రివ్యూ.. రేటింగ్ తెలుగులో...!

Movie Title; విశ్వరూపం 2 Cast & Crew: న‌టీన‌టులు: కమల్‌ హాసన్‌, పూజ కుమార్‌, ఆండ్రియా జరిమియా, నాజర్‌, రాహుల్‌ బోస్‌, శేఖర్‌ కపూర్‌ తదితరులు ద‌ర్శ‌క‌త్వం: కమల్‌ హాసన్‌ నిర్మాత‌: ప్రసాద్‌ వి.పొట్లూరి, చంద్రహాసన్‌, కమల్‌ హాసన్‌ సంగీతం: గిబ్రాన్

STORY: విశ్వరూపం 1 క్లైమాక్స్ నుండి ఈ సినిమా మొదలవుతుంది.

విశ్వనాథ్‌ (కమల్‌) కథక్‌ డాన్సర్‌.అతని భార్య అనుపమ (పూజాకుమారి) అణుశాస్త్రవేత్త.

తన ఉన్నతి గురించి విదేశాలకు వెళ్ళాల్సి ఉంటుంది.అక్కడకి వీరిద్దరు ఓ ఒప్పందంపై వెళతారు.

అక్కడ ఆమె తన బాస్‌తో ఎఫైర్‌ పెట్టుకుంటుంది.భర్తను వదిలించుకోవాలని ప్రయత్నిస్తుంది.

Advertisement

మరోవైపు అక్కడ ఓ భయంకరమైన నిజం ఆమెకు తెలుస్తుంది.అక్కడికి వెళ్ళగానే వారిపై టెర్రరిస్ట్ ఎటాక్ జరుగుతుంది.తర్వాత వారికి ఓ మిషన్ అప్పగిస్తారు.1500 టన్నుల మాధకద్రవ్యాలు ఉన్న షిప్ ను బ్రిటిష్ కోస్ట్ కు చేర్చాలి.ఆ తర్వాత వారిపై ఎలా పగ తీర్చుకున్నారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.!

REVIEW: ఇస్లామిక్‌ టెర్రరిజంపై చిలా చిత్రాలు వచ్చాయి.అయితే ఇందులో కమల్‌ పాత్ర ముస్లిమే.ఏ పాత్ర పోషించినా అందులో జీవిస్తాడు.

ఇందులోనూ కథక్‌ డాన్సర్‌గా ఒదిగిపోయాడు.అతని అభినయం అలరిస్తుంది.

కమల్‌కు వయస్సు పైబడిందనేది యాక్షన్‌ సన్నివేశాల్లో చూస్తే అనిపించదు.చాలా ఏక్టివ్‌గా చేశాడు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఎటూ తేలని 'ఖమ్మం ' కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి  ? పోటీలో ప్రియాంక గాంధీ ? 

ఇక పూజాకుమారి పాత్ర కొన్నిచోట్ల ఎక్కువగా నటించింది అనిపిస్తుంది.నాజర్‌, శేఖర్‌ కపూర్‌లు పాత్రలు బాగున్నాయి.

Advertisement

సాంకేతికంగా ప్రధానంగా చెప్పాల్సింది కెమెరాపనితనం.బాంబులు, హెలికాప్టర్లపై యాక్షన్‌ సన్నివేశాల్లో అద్భుతంగా తీశాడు.

ఒకరకంగా చెప్పాలంటే హాలీవుడ్‌ చిత్రాన్ని తలపిస్తుంది.దక్షిణాదిలో ఇటువంటి తరహా చిత్రం తీసినందుకు కమల్‌ను అభినందించాల్సిందే.

ఆఫ్ఘనిస్తాన్‌లో సన్నివేశాలు ఎండలో కూడా కష్టపడి చేశామని కమల్‌ చెప్పినమాట నిజమనిస్తుంది.ఫస్టాఫ్‌లో కాస్త స్లోగా నడిచినా.

సెకండాఫ్‌లో కథ రక్తికడుతుంది.కొన్ని సన్నివేశాలు ఉత్కంఠను కల్గిస్తాయి.

ఆఫ్ఘన్‌ దాడులు ఈ చిత్రంలో చూడవచ్చు.నిర్మాణపు విలువుల అద్భుతంగా ఉన్నాయి.

నిజంగా విశ్వరూపం చూపించాడు.నటుడు, దర్శకుడిగా ఇద్దరూ ఆయన్ను డామినేట్‌ చేశారు.

సెకండాఫ్‌లో దర్శకుడు హైలైట్ అయ్యాడు.చాలా సమర్థవంతంగా తీశాడు.

Plus points: కమల్ హస్సన్ కెమెరా పనితనం నిర్మాణపు విలువలు యాక్షన్‌ సన్నివేశాలు Minus points: స్లో నెరేషన్ Final Verdict: మరోసారి సీక్వెల్ సినిమాలు మన దగ్గర హిట్ అవ్వవు అని నిరూపించింది "విశ్వరూపం - 2 ".ఓపిక ఎక్కువ ఉంటె సినిమా చూడొచ్చు! Rating: 1.75 .

తాజా వార్తలు