హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) నటించిన లైలా ( Laila )సినిమా వివాదంలో చిక్కుకుంది.ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తూ వచ్చారు.
అయితే ఇప్పటివరకు విశ్వక్ నటించిన ఏ సినిమా విడుదలవుతున్న ఏదో విధంగా ఆ సినిమా వివాదంలో నిలుస్తూనే ఉంది.అయితే తాజాగా ఈ సినిమా పొలిటికల్ వివాదంలో చిక్కుకుంది.
ఈ సినిమా 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్ ( Pruthvi Raj )పరోక్షంగా వైసిపిని ఉద్దేశించి కామెంట్లు చేశారు.
మొదట 150 గొర్రెలు ఉండేవి చివరికి అవి 11 గొర్రెలు అయ్యాయి అంటూ ఈయన మాట్లాడితంతో కచ్చితంగా వైసీపీ పార్టీని ఉద్దేశించి మాట్లాడారంటూ వైసీపీ అభిమానులు ( Ysrcp Fans ) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బాయికాట్ లైలా సినిమా అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం విశ్వక్ ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ 25 వేల ట్వీట్లు వచ్చాయి అయితే ఇప్పటికి మాత్రం సుమారు లక్షకు పైగా ట్వీట్లు రావడంతో ఈ సినిమాకు పూర్తిస్థాయిలో నెగిటివిటి వస్తోంది.ఈ నేపథ్యంలోనే విశ్వక్ మీడియా ముందుకు వచ్చి అందరికీ క్షమాపణలు తెలియజేశారు.
నిజానికి ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదు ఆయన సినిమాలలో మాత్రమే నటించారు అతను మాట్లాడిన మాటలకు మా సినిమాని చంపేయొద్దు.

లైలా సినిమాను విడుదలయిన రోజే HD ప్రింట్ సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తున్నారు.పృథ్వి చేసిన కామెంట్స్‌కు సినిమా యూనిట్‌కు సంబంధం లేదు.స్టేజ్ పై పృథ్వి మాట్లాడేటప్పుడు నేను నిర్మాత లేము.
చిరంజీవి గారు వస్తున్నారని తెలిసి మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము.మేము కనుక అక్కడే ఉండి ఉంటే కచ్చితంగా అతని నుంచి మైక్ లాగేసుకునే వాళ్ళం.
నాతో శత్రుత్వం లేనప్పుడు నా సినిమాను ఎందుకు టార్గెట్ చేస్తారు.ఆయన అన్న మాటలకు మీరందరూ ఫీలయ్యి ఉంటే క్షమాపణలు చెబితేనే మీ ఆవేశం చల్లారుతుంది అంటే దయచేసి ప్రతి ఒక్కరూ క్షమించండి అంటూ ఈ సందర్భంగా విశ్వక్ క్షమాపణలు తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.