విష్ణు విశాల్, ప్రవీణ్ కె క్రైమ్-థ్రిల్లర్ ఆర్యన్ (A.A.R.Y.A.N ) గ్రాండ్ గా ప్రారంభం, ఫస్ట్ లుక్ విడుదల

హీరో విష్ణు విశాల్ కథానాయకుడిగా, ప్రవీణ్ కె దర్శకత్వంలో, దర్శకుడు సెల్వరాఘవన్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్యన్ (A.A.R.Y.A.N ).శ్రద్ధా శ్రీనాథ్‌, వాణీ భోజన్‌ కథానాయికలు.విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మిస్తుండగా, శుభ్ర, ఆర్యన్ రమేష్ సమర్పిస్తున్నారు.

 Vishnu Vishal Praveen K Vishnu Vishal Studioz Crime Thriller A A R Y A N Launch-TeluguStop.com

రేసీ మూమెంట్స్, ట్విస్ట్‌లు, టర్న్‌లతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైయింది,విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.ఇందులో విష్ణు విశాల్ ఖాకీ యూనిఫాంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సీరియస్ లుక్ తో చిన్న గడ్డం, మీసాలతో కనిపించాడు.ఈ చిత్రంలో సాయి రోనక్, తారక్ పొన్నప్ప, అభిషేక్ జోసెఫ్ జార్జ్, మాలా పార్వతి, ఇతర ప్రముఖ నటీనటులు కూడా ఉన్నారు.

విష్ణు సుభాష్ కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీత దర్శకుడు.

ఆర్యన్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ , హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల అవుతుంది.

నటీనటులు

: విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, వాణీ భోజన్, సాయి రోనక్, తారక్ పొన్నప్ప, అభిషేక్ జోసెఫ్ జార్జ్, మాలా పార్వతి, తదితరులు.

సాంకేతిక విభాగం :

నిర్మాత : విష్ణు విశాల్ (విష్ణు విశాల్ స్టూడియోస్) , రచన, దర్శకత్వం : ప్రవీణ్ కె, డీవోపీ – విష్ణు సుభాష్, సంగీతం – సామ్ సిఎస్ ఎడిటర్ – శాన్ లోకేష్, స్టంట్ – స్టంట్ సిల్వా, సహ రచయిత – మను ఆనంద్, ఆర్ట్ డైరెక్టర్ – ఇందులాల్ కవీద్, కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్ – వినోద్ సుందర్, సౌండ్ ఎడిటింగ్ – సింక్ సినిమా, వీఎఫ్ ఎక్స్- హరిహరసుతన్, ప్రథూల్ ఎన్ టి, సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్ – ఎకెవి దురై, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సీతారాం, క్రియేటివ్ ప్రొడ్యూసర్ – శ్రవంతి సాయినాథ్,ప్రొడక్షన్ కంట్రోలర్ – ఏఆర్ చంద్రమోహన్ పీఆర్వో – వంశీ శేఖర్

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube