వరుసగా మూడు డిజాస్టర్లు.. ఈ టాలెంట్ హీరోయిన్ ను పట్టించుకుంటారా?

సినిమా ఇండస్ట్రీలో అందం, టాలెంట్ ఉన్నా సక్సెస్ సాధించడం కూడా ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే.ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాధాన్యత ఉంటుంది.

 Ketika Sharma Will You Decide To Be Such A Heroine , Ketika Sharma,nagashourya-TeluguStop.com

తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీలో వరుసగా ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందనే సంగతి తెలిసిందే.అయితే ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన కేతిక శర్మ వరుస ఫ్లాపులతో ప్రస్తుతం కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు.

రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి కేతిక శర్మ పరిచయమయ్యారు.తొలి సినిమాతోనే కేతిక శర్మ నటిగా మంచి మార్కులు వేయించుకున్నారు.అయితే రొమాంటిక్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కేతిక శర్మకు షాక్ తగిలింది.ఆ తర్వాత నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన లక్ష్య సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించారు.

అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేదు.

Telugu Ketika Sharma, Lakshya, Nagashourya, Rangaranga, Romantic, Tollywood-Movi

కేతిక శర్మ హీరోయిన్ గా తెరకెక్కి తాజాగా థియేటర్లలో విడుదలైన రంగ రంగ వైభవంగా సినిమా ప్రస్తుతం నెగిటివ్ టాక్ తో ప్రదర్శితమవుతోంది.ఈ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోవడంతో టాలెంటెడ్ హీరోయిన్ అయిన కేతికను టాలీవుడ్ ఇండస్ట్రీ పట్టించుకోదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఫ్లాపుల్లో హ్యాట్రిక్ సాధించిన ఈ బ్యూటీ కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.

Telugu Ketika Sharma, Lakshya, Nagashourya, Rangaranga, Romantic, Tollywood-Movi

వరుసగా మూడు ఫ్లాపులతో ఐరన్ లెగ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న కేతిక శర్మకు అవకాశాలు ఇచ్చేవారు ఉంటారో లేదో చూడాల్సి ఉంది.తన తప్పేం లేకపోయినా ఈ స్టార్ హీరోయిన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు.కేతిక శర్మ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలంటే మంచి కథ, కథనం ఉన్న సినిమాలపై దృష్టి పెట్టాల్సి ఉంది.అందం, అభినయం ఉన్నా ఈ హీరోయిన్ జాతకంలో అదృష్టం లేదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube