బీహార్ సీఎం నితీష్ కుమార్ కు షాక్ తగిలింది.మణిపూర్ లో ఉన్న మొత్తం ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీ గూటికి చేరారు.
స్పీకర్ ఆమోదంతో అధికారికంగా బీజేపీలోకి వెళ్లారు.ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో ఎమ్మెల్యేల చేరిక అనంతరం బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ నితీష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లు జేడీయూ ముక్త్ రాష్ట్రాలుగా అవతరించాయని స్పష్టం చేశారు.







