''కన్నప్ప'' సెట్స్ లో కామెడీ కింగ్.. వీడియో చూసారా?

టాలీవుడ్ లో పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో ”కన్నప్ప” ( Kannappa ) ఒకటి.ముందులో ఈ సినిమాపై ఇన్ని అంచనాలు లేవు.

 Vishnu Manchu Dream Project Kannappa's Video Viral, Manchu Vishnu, Tollywood, Mo-TeluguStop.com

కానీ సమయం గడిచే కొద్దీ ఈ సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి.టాలీవుడ్ హీరోల్లో ఒకరైన మంచు విష్ణు ( Manchu Vishnu ) మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఈయన కెరీర్ లో ఏ సినిమాకు కూడా ఇంత హైప్ పెరగలేదు.కానీ కన్నప్ప మాత్రం స్పెషల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.

ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, శివ రాజ్ కుమార్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.ఇంకా చాలా మంది స్టార్స్ పేరు బయటకు రావాల్సి ఉంది.

ఒక్కో అప్డేట్ వస్తుంటే మరిన్ని అంచనాలు పెరిగి పోతున్నాయి.

ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఒక్కసారిగా అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.మహా శివలింగం ముందు బాణం విల్లు పట్టుకుని ఎక్కుపెట్టిన వారియర్ లా విష్ణు కనిపించడంతో ఈ రేంజ్ పోస్టర్ ఊహించని వారంతా స్టన్ అయ్యారు.ఇదిలా ఉండగా ఈ సినిమా సెట్స్ నుండి ఒక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో బ్రహ్మానందం ( Brahmanandam ) కూడా భాగం అయ్యిన విషయం తెలిసిందే.మరి తాజాగా కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా ఈ షూట్ లో పాల్గొన్నారని ఎక్కువ పార్ట్ సింగిల్ టేక్ లోనే ఓకే అయ్యాయని ఈ షూట్ ను ఎంతో ఎంజాయ్ చేశామని బ్రహ్మి మోహన్ బాబు ( Mohan Babu ) తో మాట్లాడుతున్న వీడియోను షేర్ చేసారు.

ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా ముఖేష్ కుమార్ సింగ్ ( Mukesh Kumar Singh ) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా మంచు మోహన్ బాబు ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక మణిరత్నం, స్టీఫెన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూట్ మొత్తం న్యూజిలాండ్ లోనే ఫినిష్ చేస్తున్నారు.ముందు ముందు ఈ మూవీ నుండి ఒక్కో అప్డేట్ రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube