”కన్నప్ప” సెట్స్ లో కామెడీ కింగ్.. వీడియో చూసారా?

టాలీవుడ్ లో పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో ''కన్నప్ప'' ( Kannappa ) ఒకటి.

ముందులో ఈ సినిమాపై ఇన్ని అంచనాలు లేవు.కానీ సమయం గడిచే కొద్దీ ఈ సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి.

టాలీవుడ్ హీరోల్లో ఒకరైన మంచు విష్ణు ( Manchu Vishnu ) మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఈయన కెరీర్ లో ఏ సినిమాకు కూడా ఇంత హైప్ పెరగలేదు.కానీ కన్నప్ప మాత్రం స్పెషల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.

ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, శివ రాజ్ కుమార్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.

ఇంకా చాలా మంది స్టార్స్ పేరు బయటకు రావాల్సి ఉంది.ఒక్కో అప్డేట్ వస్తుంటే మరిన్ని అంచనాలు పెరిగి పోతున్నాయి.

"""/" / ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఒక్కసారిగా అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

మహా శివలింగం ముందు బాణం విల్లు పట్టుకుని ఎక్కుపెట్టిన వారియర్ లా విష్ణు కనిపించడంతో ఈ రేంజ్ పోస్టర్ ఊహించని వారంతా స్టన్ అయ్యారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా సెట్స్ నుండి ఒక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో బ్రహ్మానందం ( Brahmanandam ) కూడా భాగం అయ్యిన విషయం తెలిసిందే.

మరి తాజాగా కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా ఈ షూట్ లో పాల్గొన్నారని ఎక్కువ పార్ట్ సింగిల్ టేక్ లోనే ఓకే అయ్యాయని ఈ షూట్ ను ఎంతో ఎంజాయ్ చేశామని బ్రహ్మి మోహన్ బాబు ( Mohan Babu ) తో మాట్లాడుతున్న వీడియోను షేర్ చేసారు.

ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. """/" / కాగా ముఖేష్ కుమార్ సింగ్ ( Mukesh Kumar Singh ) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా మంచు మోహన్ బాబు ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇక మణిరత్నం, స్టీఫెన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూట్ మొత్తం న్యూజిలాండ్ లోనే ఫినిష్ చేస్తున్నారు.

ముందు ముందు ఈ మూవీ నుండి ఒక్కో అప్డేట్ రానుంది.

చందు మొండేటి స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే ఇదొక్కటే దారి…