కోలీవుడ్ ( Kollywood ) స్టార్ హీరోల్లో విశాల్ ( Vishal ) ఒకరు.స్టార్ హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్.
ఈయన తెలుగువాడైన కూడా కోలీవుడ్ లో హీరోగా రాణిస్తూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఇటు టాలీవుడ్ లో కూడా విశాల్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే చెప్పాలి.
ఎందుకంటే ఈయన సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాలు సాధిస్తుంటాయి.

వరస హిట్స్ తో కేరీర్ లో జెట్ స్పీడ్ గా దూసుకు పోయిన విశాల్ కు ఈ మధ్య సరైన హిట్ పడడం లేదు.ఇటీవలే ఈ యాక్షన్ హీరో నటించిన ”లాఠీ” సినిమాతో అయిన హిట్ కొట్టాలని బలంగా అనుకున్నాడు.కానీ ఇది కూడా ఈయన కెరీర్ ను గాడిలో పెట్టలేక పోయింది.
ఇదిలా ఉండగా తాజాగా విశాల్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేసాడు.

విశాల్ కెరీర్ కు రెండు సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ హరితో మూడవ సినిమా తాజాగా అనౌన్స్ మెంట్ చేశారు.విశాల్ కెరీర్ లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇలా హ్యాట్రిక్ కలయికలో మరోసారి హరి ( Director Hari ) తో సినిమా అనౌన్స్ చేయడంతో కోలీవుడ్ లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.విశాల్ తన 34వ ( Vishal34 )సినిమాను హరితో ప్రకటించాడు.

ఇప్పటికే వీరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు కూడా సాలిడ్ యాక్షన్ సినిమాలే.ఇక మూడవ సారి ( Hat-trick film ) కూడా అలాంటి సబ్జెక్ట్ తోనే రాబోతున్నాడు అన్నట్టు అనౌన్స్ మెంట్ పోస్టర్ చూస్తుంటే అర్ధం అవుతుంది.ఈ పోస్టర్ లో ఒక స్టెతస్కోప్, చుట్టూ కత్తులు, సంకెళ్లు వంటివి కనిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాను స్టోన్ బెంచర్స్ ( stone benchers ) మరియు జీ స్టూడియోస్ సౌత్ ( Zee Studios South ) కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు.
మరి ఈ హ్యాట్రిక్ కలయికతో హ్యాట్రిక్ కొడతారా లేదా అనేది వేచి చూడాలి.







