విశాఖకు జ్వరమొచ్చింది! రోగులతో ఆసుపత్రులు కిటకిట..

విశాఖకు జ్వరమొచ్చింది! రోగులతో ఆసుపత్రులు కిటకిట.ఇప్పటి వరకు 374 కేసులు నమోదు.

విశాఖ జిల్లా డెంగ్యూ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ, మలేరియా కేసులు గణనీయంగా పెరగడంతో పాటు నగర ప్రజలను దడ పుట్టిస్తున్నాయి.

రాష్ట్రంలోనే‌ హైరిస్క్ జిల్లాగా ఆరోగ్య శాఖ అధికారులు విశాఖను గుర్తించారు.ముఖ్యంగా విశాఖ నగరంతో పాటు రూరల్ ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.

డెంగ్యూ వ్యాధి నివారణకు ఆరోగ్య శాఖ అధికారులు నివారణ చర్యలు తీసుకుంటున్న ప్రజలు కనీసం మార్పు రాకపోవడంతో పాటు పరిసరాల పరిశుభ్రత ఇతర కారణాల నేపథ్యంలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి.విశాఖ జిల్లాలో ఇప్పటివరకు 374 కేసులు అధికారికంగా నమోదయ్యాయి.

Advertisement

అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.ముఖ్యంగా నగరంలోని ప్రాంతాలతో పాటు నగరంలో కూడా అధిక సంఖ్యలో నమోదవతున్నాయి.

ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య పెరగడంతో ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయినిగా సేవలందిస్తున్నా కేజీహెచ్ (KHG), ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా రోగుల తాకిడి అధికంగా ఉంది.

ముఖ్యంగా కేజీహెచ్(KGH) లోని చిన్న పిల్లలు వార్డుతో పాటు ఇతర వార్డులు సైతం సాధారణ, ఇతర జ్వరాలతో నిండిపోతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా అధికంగా విశాఖ జిల్లాలోని గణనీయంగా మలేరియా కేసులు నమోదయ్యాయి.అయితే ఆరోగ్యశాఖ చేపడుతున్న నివారణ చర్యలు నేపథ్యంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ ఏడాది పెద్దగా కేసులు నమోదు కాలేదు గత ఏడాది విశాఖ జిల్లాలో 1260 పాజిటివ్ కేసులు నమోదయితే ఈ ఏడాది ఇప్పటివరకు 595 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు.

వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..
Advertisement

తాజా వార్తలు