ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు..!

తాజాగా జరిగిన ఐపీఎల్( IPL ) మ్యాచ్లో హైదరాబాద్ జట్టుపై విజయం సాధించి బెంగళూరు జట్టు( RCB ) ప్లే ఆఫ్ అవకాశాలను సజీవం చేసుకుంది.చివరి ఓవర్ వరకు సాగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది.

 Virat Kohli's New Record In The History Of Ipl Details, Virat Kohli,chris Gayle,-TeluguStop.com

ఈ తాజా మ్యాచ్లో రెండు సెంచరీలు నమోదు అయ్యాయి.హైదరాబాద్ జట్టు బ్యాటర్ హెన్రీచ్ 104, బెంగళూరు జట్టు బ్యాటర్ 100 పరుగులతో చెలరేగి అద్భుత ఆటను ప్రదర్శించారు.

Telugu Ab De Villiers, Chris Gayle, Cricket Latest, Ipl Playoffs, Ipl Latest Ups

మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 185 పరుగులు చేసింది.తరువాత లక్ష్య చేదనకు దిగిన బెంగళూరు జట్టు 172 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.విరాట్ కోహ్లీ( Virat kohli ) 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్ లతో 100 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.19.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి బెంగళూరు జట్టు విజయం సాధించి ప్లే ఆఫ్( Playoffs ) ఆశలను సజీవం చేసుకుంది.ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఆరవ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు.

వెస్టిండీస్ క్రికెటర్, బెంగళూరు జట్టు మాజీ ప్లేయర్ క్రిస్ గేల్( Chris Gayle ) ఐపీఎల్ లో ఆరు సెంచరీలు చేసి అగ్రస్థానంలో నిలిచాడు.ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆ రికార్డును సమం చేశాడు.

Telugu Ab De Villiers, Chris Gayle, Cricket Latest, Ipl Playoffs, Ipl Latest Ups

గతంలో ఒకసారి చూసుకుంటే 2015లో హైదరాబాద్-బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి బెంగుళూరు జట్టును గెలిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు.8 ఏళ్ల అనంతరం తాజాగా హైదరాబాద్-బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్లో మళ్లీ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి బెంగుళూరు జట్టును గెలిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు.

అంతేకాకుండా బెంగుళూరు తరపున అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన మూడవ బ్యాటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.ఈ జాబితాలో 23 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచి ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు.

క్రిస్ గేల్ 17 సార్లు గెలిచి రెండవ స్థానంలో ఉన్నాడు.ఇక విరాట్ కోహ్లీ 16వసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచి మూడవ స్థానంలో నిలిచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube