టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ( Virat Kohli ) గురించి క్రికెట్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.కోహ్లీ ఫాన్స్ విషయంలో మొదటి నుండి చాలా కేరింగ్ వుంటారు.
ఎవరన్నా తనకోసం ప్రత్యేకమైన అభిమానాన్ని చూపితే వారిని గుర్తిస్తారు.అంతేకాకుండా వారిని కలుసుకొని తన ఆనందాన్ని కూడా తెలియజేస్తాడు.
ఈ క్రమంలోనే తాజాగా మనోడు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు.అవును, ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచుకు ముందు శ్రీనివాస్ అనే అభిమానిని కలిసి ఆప్యాయంగా పలకిరించాడు.

శ్రీనివాస్ అనే యువకుడు అంగవైకల్యం కావడంతో విరాట్ స్వయంగా అతడి దగ్గరికి వెళ్ళి మరీ అతగాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం విశేషం.ఈ సందర్భంగా శ్రీనివాస్.కోహ్లీకి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. హ్యాండ్‌మేడ్ పోర్ట్రెయిట్‌ను తయారు చేయబడిన ఈ పెయింటింగ్ చాలా బాగుంది.దీనిని గీయడానికి తనకు 40 గంటలు పట్టిందని అతగాడు చెప్పాడు.కోహ్లీని కలవడంతో తన జన్మ ధన్యమైందని, ఇదంతా ఒక కలలా అనిపించిందని తన సంతోషాన్ని శ్రీనివాస్( Srinivas ) వ్యక్తం చేసాడు.

ఇకపోతే శ్రీనివాస్ గ్రాఫిక్ డిజైన్ చదువుతున్నాడు.వరల్డ్ కప్ మ్యాచ్ చూసేందుకు టికెట్లు కొనడానికి వచ్చాడు.కానీ ఇక్కడ కోహ్లీని కలుసుకోవడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది.ఇకపోతే కోహ్లీ ఇలా ఫ్యాన్ ని ప్రత్యేకంగా కలుసుకోవడం ఇదే తొలిసారి కాదు.గతంలో ఎన్నోసార్లు కోహ్లీ అలా తన అభిమానులను కలుసుకొని సర్ ప్రైజ్ చేసాడు.దీంతో సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా.భారత్-ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 8 న వరల్డ్ కప్ లో తమ తొలి మ్యాచ్ ఆడబోతున్నారు.
చెన్నైలోని చిదంబరం స్టేడియం( MA Chidambaram stadium ) ఈ మ్యాచుకు ఆతిధ్యమిస్తుంది.







