ఖమ్మం జిల్లాలోని గుడిపాడులో పోడు వివాదం తలెత్తింది.పోడు భూములను సాగు చేసుకుంటున్న స్థానిక ప్రజలు పంటలను సాగు చేసుకుంటున్నారు.
అయితే స్థానికుల పంటలను అటవీశాఖ అధికారులు ధ్వంసం చేశారు.ఈ క్రమంలోనే కంది, మొక్కజొన్న, జీడీ మొక్కలను అధికారులు పీకేశారు.
దీంతో పీకేసిన మొక్కలతో పోడు సాగుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులు తమ పంటలను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై ఫిర్యాదు చేశారు.
తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.దీంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.







