వైరల్: బిచ్చగాడు చిల్లరతో ఐఫోన్‌ కొంటే ఎలాగుంటుందో చూస్తారా?

ఐఫోన్‌ గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నేటి నవతరం కలలుగనే ఫోన్ అది.

 Viral: Will You See What Happens If A Beggar Buys An Iphone With Retail, Viral,-TeluguStop.com

కానీ, దాని ఖరీదు చూసి సామాన్యులు దానిని కొనడానికి వెనుకాడుతుంటారు.కానీ ఓ బిచ్చగాడు ఐఫోన్‌ కొన్నాడంటే మీరు నమ్ముతారా? పోనీ అతను ఐ ఫోన్‌ కొనడానికి వెళ్తే షాప్‌ నిర్వాహకులు అతగాడిని ఎలా చూస్తారు? అసలు ముందు లోపలికి రానిస్తారా? కస్టమేకదా.పోనీ అతడు సాహసించి మొత్తం నగదు చిల్లర ఇస్తానంటే అంగీకరిస్తారా? అవును, సరిగ్గా ఇలాంటి ప్రశ్నలతో ఓ ప్రయోగం చేశారు ‘ఎక్స్‌ పెరిమెంట్‌ కింగ్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌( YouTube channel ) నిర్వాహకులు.వారిలో ఒకరు బిచ్చగాడి వేషం వేసుకొని తొలుత జోధ్‌పూర్‌లో కొన్ని మొబైల్‌ షోరూంలు తిరిగాడు.

ఈ క్రమంలో కొందరు లోపలికి రానివ్వకపోగా.మరికొందరు చిల్లర తీసుకోవడానికి ససేమిరా అన్నారు.చివరగా ఓ షాపు యజమాని మాత్రం ఆ బిచ్చగాడి వేషంలో( Beggar ) వున్నవాడి దగ్గర చిల్లర తీసుకొని తనకు ఐ ఫోన్‌ ప్రో మ్యాక్స్‌( Apple iPhone Pro Max ) మోడల్‌ను అందజేశాడు.ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత తాను నిజమైన బిచ్చగాడిని కాదని, ఇదో ప్రాంక్‌ అని చెప్పడంతో ఆయన చాలా ఆశ్చర్యపోయాడు.

కాగా ఈ వీడియో క్లిప్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ క్రమంలో కొంతమంది నెటిజనం ‘షాపు యజమానికి కస్టమరే దేవుడు.అందుకే చిల్లర తీసుకొని మరీ ఐ ఫోన్‌ ఇచ్చేశాడని’ కామెంట్స్ చేస్తే, మరికొందరు ‘ఐ ఫోన్‌ కొన్న వ్యక్తి ముంబయిలో సులభ్‌ కాంప్లెక్స్‌ నిర్వహించి ఉంటాడని, అందుకే అంత చిల్లర వచ్చిందని’ సరదాగా కామెంట్‌ చేయడం ఇక్కడ చూడవచ్చు.కాగా మరికొందరు మాత్రం ‘ఇవన్నీ పాత స్టంట్స్‌ అని, స్క్రిప్టు రాసుకొని కొత్తగా ఏమైనా ట్రై చేయండని’ మరో సలహా ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube