వైరల్ వీడియో.. వెంటపడి వేధిస్తున్న యువకుడిని కర్రతో చితకబాదిన మహిళ

ప్రస్తుతం దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది.నిత్యం ఏదో ఒక చోట ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మగాళ్ల గురించి వార్తల్లో వింటూనే ఉన్నాం.

వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఇలా మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఇటీవల విజయవాడలో తన వెంట పడి వేధిస్తున్న ఓ పోకిరికి యువతి బుద్ధి చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ కుటుంబం మంచిగా బతకాలంటే మహిళలు కూడా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.అందుకే మహిళలు కూడా ఉద్యోగాలు వెళ్లివస్తున్నారు.

అయితే రాత్రిపూట ఒంటరిగా ఇంటికి వెళ్లే మహిళలను కొందరు మృగాళ్లు టార్గెట్ చేస్తున్నారు.విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి ఇంటికి రాత్రిపూట వెళుతుండగా ఓ పోకిరి బైకును అడ్డగించి వేధింపులకు గురిచేశాడు.

Advertisement

దీంతో ఆమె సదరు పోకిరిని కర్ర తీసుకుని చితకబాదింది.సదరు మహిళ పోకిరికి దేహశుద్ధి చేసే వీడియోను ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

యువతి చూపిన ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ ఆమె కామెంట్ చేశారు.ఇలాంటి మహిళలను చూసి మిగతా ఆడవాళ్లు కూడా ఎంతో ధైర్యం తెచ్చుకుని జీవితంలో ముందుకు సాగిపోవాలి.సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే చాలా మంది మహిళలు కంగారుపడిపోతారు.

వాళ్ల కంగారే మ‌ృగాళ్లకు ఆయుధంగా మారుతోంది.అలా కాకుండా ధైర్యంగా ఎదురొడ్డి నిలబడితే ఎంతటి నీచుడు అయినా భయపడి పారిపోవాల్సిందే.

ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆలస్యం కావడంతో వేరే వ్యక్తిని లిఫ్ట్ అడిగింది.దీంతో ఆమెను దుండగులు అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
షాకింగ్ వీడియో : ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన బైకర్.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం..

 ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు