వైరల్ వీడియో: కూర్చున్న కొమ్మనే నరుక్కున్న యువకుడు.. ఉన్నాడా, పోయాడా..?

ముందు చూపు లేకపోతే సర్వనాశనం కావడం ఖాయమని పెద్దలు చెబుతుంటారు.ఇదే విషయాన్ని కూర్చున్న కొమ్మనే నరుక్కున్న మూర్ఖుడి కథతో చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా చెబుతారు.

 Viral Video: The Young Man Who Cut The Branch He Was Sitting On.. Is He There Or-TeluguStop.com

ఆలోచించకుండా ఏ పని చేసినా చివరికి పెద్ద పర్యవసానాలను ఫేస్ చేయక తప్పదు.అదే నిజాన్ని కూర్చున్న కొమ్మని నరుకున్న కథ బాగా తెలియజేస్తుంది.

మామూలుగా ఒక చెట్టు కొమ్మపై కూర్చుని దాని మొదలు నరికితే అది విరగడమే కాక మన కాలో లేదా చేయో విరుగుతుంది.ఇలాంటి పని బాగా ఫూలిష్ అయిన వ్యక్తులు తప్ప ఎవరూ చేయరని చెప్పుకోవచ్చు.

అయితే అలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియా( Social media )లో వైరల్ అయింది.

@FAFO_TV ట్విట్టర్( Twitter ) పేజీ షేర్ చేసిన ఈ వీడియో ఆరు సెకన్ల నిడివి కలిగి ఉంది.దీనికి ఇప్పటికే 10 లక్షలు పైగా వ్యూస్, పదివేలకు పైగా లైక్స్ వచ్చాయి.ఈ వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఒక కొమ్మ చివరిలో కూర్చున్న యువకుడిని మనం చూడవచ్చు.

అతడి చేతిలో చాలా పదునైన వేట కొడవలి ఉంది.ఆ కొడవలితో( Sickle ) అతను ఆ కొమ్మ యొక్క చిన్న బ్రాంచ్ నరికాడు.

అనంతరం మొత్తం కొమ్మని నరికేశాడు.ఒక వేటుతోనే కొమ్మ తెగిపడింది దానితోపాటు యువకుడు క్షణాల్లోనే కింద పడిపోయారు.

వీడియోని పరిశీలనగా చూస్తుంటే యువకుడు దాదాపు 15 అడుగుల ఎత్తులో ఉన్నట్లు కనిపిస్తోంది.ఆ ఎత్తు నుంచి కింద పడటం వల్ల అతడికి బాగానే గాయాలై ఉంటాయని అర్థం చేసుకోవచ్చు.అయితే ఈ యువకుడు చెట్టు నరకడానికి మరొక వ్యక్తి వీడియో తీశాడు.ఇప్పుడు అదే వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.దీన్ని చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు.మరీ ఇంత వెర్రోళ్ళు ఉంటారని అస్సలు అనుకోలేదని కొంతమంది కామెంట్లు పెట్టారు.

బహుశా అతడు తన కొడవలి పదును చెక్ చేయడానికి నరికి ఉంటాడేమో అని మరికొందరు ఫన్నీగా వ్యాఖ్యానించారు.ఇంతకీ ఈ వ్యక్తి బతికే ఉన్నాడా? లేక పోయాడా? అని మరికొందరు ఫన్నీగా అడిగారు.ఈ హిలేరియస్ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube