ఓ తండ్రి తన పిల్లాడిని నీటిలో మునిగిపోకుండా ప్రాణాలకు తెగించి కాపాడాడు.ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.జేవియర్ రిగ్నీ అనే 4 ఏళ్ల బాలుడు తన తల్లి దగ్గర ఆడుకుంటున్నాడు.
అలా ఆడుకుంటూ ఆడుకుంటూ పక్కనే ఉన్న స్విమ్మింగ్ ఫుల్ వద్దకు చేరుకున్నాడు.చిన్న పిల్లలు లోపలకి వెళ్లకుండా ఉండేందుకు ఆ స్విమ్మింగ్ పూల్ ఎదుట ఒక కంచెను కూడా ఏర్పాటు చేశారు.
కానీ, జేవియర్ రిగ్నీ ఆ కంచెనుదాటి వెళ్లి.స్విమ్మింగ్ పూల్ లో పడ్డాడు.
బాలుడి సోదరుడు మాడాక్స్ వెస్టర్‌హౌస్ (12) జేవియర్ స్విమ్మింగ్‌లో మునిగిపోవడాన్ని చూసి వెంటనే వెళ్లి తండ్రికి చెప్పాడు.తండ్రి టామ్ హుటాహుటినా అక్కడికి పరిగెత్తి ఫూల్ లో దూకేసిన పిల్లాడిన పైకి తీసుకొచ్చాడు.
అదృష్టవశాత్తూ.అదే సమయంలో మాడాక్స్, వారి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుంచి తన తండ్రిని తీసుకురావడానికి పరుగెత్తాడు.టామ్ లాక్ కంచెపై నుంచి దూకి పిల్లవాడ్ని రక్షించాడు.పిల్లాడిని పూల్ నుంచి బయటకు లాగిన వెంటనే తండ్రి CPR అందించాడు.
నీళ్లు మింగేసిన పిల్లాడు బయటకు వచ్చేలా చేశాడు.కాసేపటికి పిల్లాడు తేరుకున్నాడు.
ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.టామ్ మాడాక్స్ సరైన సమయంలో స్పందించడంతో బాలుడి ప్రాణాలను రక్షించాడు.
ఈ వీడియోను తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేయడంతో 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.జేవియర్ స్విమ్మింగ్ ఫూల్‌లో ఎలా మునిగిపోయాడో వీడియోలో చూడవచ్చు.
పిల్లాడు ఫూల్‌లో దూకిన సమయంలో పక్కన ఎవరూ లేరు.ఈ వీడియోను చూసిన వారంతా తండ్రిని సూపర్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు.
ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోను చూసేయండి.







