సాధారణంగా మనం కార్ రేస్, బైక్ రేస్ లు నిర్వహించడం గురించి వినే ఉంటాం.అయితే ఆటో రేస్ గురించి ఎన్నడూ కూడా విని ఉండరు.
తాజాగా తమిళనాడు రాజధాని అయిన చెన్నై నగరంలో ఆటో రేస్ నిర్వహణ కలకలం సృష్టించింది.అతి భయంకరమైన ఆటో రేస్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.
ఆ వీడియోలు కాస్త చెన్నై పోలీసులు కంట పడడంతో వారు వెంటనే అలర్ట్ అయ్యి వీడియో ఆధారంగా ఆటో రేస్ లో పాల్గొన్న వారిని గుర్తించే పనిలో నిమగ్నం అయిపోయారు.ఈ క్రమంలో ఆటో రేస్ లో పాల్గొన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
తాజాగా చెన్నై నగర శివార్లలోని తాంబరం నుంచి పోరూర్ వరకు హైవేపై ఆటో రేస్ నిర్వహించారు.ఈ క్రమంలో చాలా ప్రమాదకరంగా నడుపుతున్న ఆటో డ్రైవర్లు రేస్ లో పాల్గొన్నట్లు సమాచారం.
అంతేకాకుండా కేసులో భాగంగా ఆటో రేస్ కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.ఈ రేసులో విజయం సాధించిన వారికి 10000 రూపాయలు బహుమతిగా ప్రకటించారు.
ఇది ఇలా ఉండగా ఈ ఆటో రేస్ చూసిన కొంత మంది ప్రజలు భయంతో హడలి పోయారు.అలాగే రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లే వారికి, ఇతర ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది ఆటో రేస్.
అయితే గతంలో కూడా ఇలా ఆటో రేస్ నిర్వహించిన క్రమంలో ఆటో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో ఒక ఆటో డ్రైవర్ మృతి చెందాడు.ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అనేక ఆటో రేసుల్లో ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోవడం వల్ల పోలీసులు ఆటో రేట్లపై నిషేధం కూడా విధించారు.అయితే మళ్ళీ ఆటో రేసులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వీడియోలు వెలుగులోకి రావడంతో పోలీసులు సీరియస్ గా ఆటో రేస్ నిర్వహించిన వారిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.