వైరల్ వీడియో: తనతో మాట్లాడడం లేదని యువతిపై కాల్పులు..

తాజాగా ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh )రాష్ట్రంలోని ఝాన్సీ నగరంలో ఓ అమ్మాయిపై పిస్టోలుతో కాల్పులు జరిపాడు యువకుడు.20 ఏళ్ల యువతి యువకుడుతో మాట్లాడడానికి నిరాకరించినందుకు సదరు యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో యువతిపై కాల్పులు జరిపే ముందు ఆ యువతి యువకుడి నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించినట్లు కనపడుతుంది.డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఆ అమ్మాయిని గత ఆరు నెలల నుంచి ప్రేమిస్తున్నానంటూ వెనుక పడుతూ వేధిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.

ఈ ఉదాంతం రోడ్డుపై ఉన్న సిసి టీవీ ఫోటేజీలో రికార్డు అయింది.

తనతో మాట్లాడాలని ఒత్తిడి చేస్తున్న సమయంలో చాలాసార్లు అతడిని మాట్లాడనివ్వకుండా వెళ్లేందుకు ప్రయత్నం చేయగా.చివరికి ఆ యువకుడు ఇలాంటి అఘాయిత్యంకు పాల్పడ్డాడు.ఇక జూన్ ఆరో తారీఖున అమ్మాయి కళాశాలలో పరీక్ష ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో రోహిత్ ( Rohit )అనే యువకుడు ఆ అమ్మాయిపై ఈ పాడు పనికి పాల్పడ్డాడు.

Advertisement

అయితే అలా పిస్టోల్ తీసి కాల్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగి అమ్మాయి గన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిన సంఘటనలో చివరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.రోహిత్ ఆ అమ్మాయి పై కాల్పులు జరపాడు.అయితే ఈ ఘటనలో అమ్మాయికి బుల్లెట్ గాయాలు అవ్వగా ఆసుపత్రిలో చేర్పించగా క్షేమంగా బయటపడింది.

ఇక ఈ సంఘటనకు సంబంధించి అమ్మాయి తల్లి మాట్లాడుతూ.ఇదివరకే రోహిత్ తల్లిదండ్రులతో తాను మాట్లాడాలని ఎటువంటి ఇబ్బంది కలగచేయమని చెప్పిన వారు.

మళ్లీ ఇప్పుడు రోహిత్ ఇలా చేయడంతో పోలీస్ కేసును నమోదు చేసినట్లు పేర్కొంది.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు