ఈ వీడియో చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే!

రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము.ఒక్కోసారి మన వాహనం అదుపుతప్పి వేరే వాహనాలను ఢీ కొట్టడం.

మరోసారి మనం జాగ్రత్తగా వెళ్తున్నా ఎదుటివారు వచ్చి మన వాహనానికి డాష్ ఇవ్వడం చూస్తూనే ఉంటాం.ఇలాంటి సంఘటనలలో కొన్నిసార్లు అయితే రెప్పపాటులో ప్రమాదం నుండి బయటపడతాం.

కొన్నిసార్లు అయితే విగత జీవులుగా మారను వచ్చు.ఇలా రెప్పపాటులో ప్రమాదం నుండి బయటపడిన కోవకు చెందిన ఓ వీడియో మరోసారి వైరల్ అవుతుంది.2019లో వియత్నంలోని గోయ్ నామ్ దిన్ ప్రాంతంలోని రహాదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.ఒక కుటుంబం తమ బైక్ పై రోడ్డుపై ప్రయాణిస్తున్నారు.

బైక్ వెనుక ఒక మహిళ తన బిడ్డను ఎత్తుకుని వెనుకాల కూర్చుంది.అప్పుడు ఒక కారు వేగంగా వచ్చి వారు ప్రయాణిస్తున్న బైక్ ని ఢీకొట్టింది.

Advertisement

దీంతో బైక్ ఒక్కసారిగా అదుపుతప్పడంతో వెనుక కూర్చున్న తల్లి, బిడ్డలు బోర్లుకుంటూ కిందపడ్డారు.కిందపడి పక్కకు చూసే లోపు వారివైపు ఒక ట్రక్ వేగంగా దూసుకొస్తోంది.

అప్పుడు ఒక షాకింగ్ ఘటన జరిగింది.తల్లి, తన బిడ్డతో పాటు.

జారుకుంటూ ట్రక్ కిందకు వెళ్తున్నారు.

ఆ క్షణంలో మెరుపు వేగంతో స్పందించిన తల్లి.తన బిడ్డను ట్రక్ టైర్ల కింద వెళ్లకుండా పక్కకు లాగింది.తాను కూడా వేగంతో కిందకు జారీంది.

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
రీల్స్ పిచ్చి తగలయ్య.. బైక్ పై మరో బైక్ ఉంచి యువకుల సాహసాలు..

దీంతో ఒక్కసారిగా వారు రెప్ప పాటు కాలంలో కాలంలో ప్రమాదం నుంచి బయట పడ్డారు.ఈ ప్రమాదం ఎప్పుడో జరిగింది.

Advertisement

ప్రస్తుతం దీన్ని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ జోఫ్రా ఆర్చర్ తన ఇన్ స్టాలో షేర్ పోస్ట్ చేశారు.ఆ సదరు మహిళను సమయ స్ఫూర్తికి అభినందిస్తూ.

మదర్ ఆఫ్ ది ఇయర్ అంటూ రాసుకొచ్చారు.ప్రస్తుతం ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా వార్తలు