సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.ఎక్కువగా జంతువులకు సంబందించిన వీడియోలను నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఫిష్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.మీకు అక్వేరియంలో అందంగా అటూ ఇటూ తిరుగుతూ అందరిని తనవైపు ఆకర్షిoచించుకునే గోల్డ్ ఫిష్ గురించి తెలిసే ఉంటుంది.
చూడడానికి ఎంతో అందంగా ఉండే గోల్డ్ ఫిష్ ను ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది ఎవరికయినా.అయితే అలాంటి గోల్డ్ ఫిష్ అక్వేరియంలో ఉండే డ్రైవింగ్ చేసేస్తోంది మరి.అది ఎలా అనుకుంటున్నారా.? శాస్త్రవేత్తలు జరిపిన ఒక పరిశోధనలో భాగంగా ఈ చేప యొక్క తెలివితేటలూ బయటపడ్డాయి.ఈ గోల్డ్ ఫిష్ చేప అటూ ఇటూ ఈదుతూ నీటితో నింపిన వాటర్ ట్యాంక్ ని తెలివిగా ముందుకు తీసుకు వెళుతుంది.ప్రస్తుతం ఈ చేప వీడియో సోషల్‌మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది.
అసలు చేప ఏంటి.? నీటిలో డ్రైవ్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా.? అసలు వివరాల్లోకి వెళితే.
ఓ చిన్న వాటర్ ట్యాంక్ ను తీసుకుని దానిని నీటితో నింపి అందులో గోల్డ్ ఫిష్‌ని ఉంచారు.
అలాగే ఆ ట్యాక్ కింద ఒక నాలుగు చక్రాలను అమర్చడంతో పాటు, ట్యాంక్ నుంచి ఓ గొట్టాన్ని నిలబెట్టి దానికి పైన ఓ లైడర్, కంప్యూటర్, కెమెరా కూడా అమర్చారు.కెమెరా ద్వారా చేప యొక్క కదలికలను తెలుసుకునే ప్రయత్నం చేయడానికి శాస్త్రవేత్తలు అలా కెమెరా ఫిక్స్ చేసారాన్నమాట.
ఇప్పుడు ఆ చేప తన ముందు ఉన్న అన్ని అడ్డంకులను తప్పించుకుని తెలివిగా ముందుకు వెళుతుందో లేదో అనేది చూడాలి.నిజంగానే ఆ చేప చాలా తెలివిగా ముందుకు ఇదుతూ వెళ్ళింది.
అలాగే ఆ చేప ముందుకు ఎటు వెళ్తే అటు ఆ ట్యాంక్ కూడా కదలడం మనం వీడియోలో చూడవచ్చు.

అసలు ఈ ప్రయోగం చేయడం వెనుక గల కారణం ఏంటటే.చేపలు తమకు ఎదుటి జంతువుల నుంచి వచ్చే ప్రమాదాలను తప్పించుకోవడానికి, తమ ఆహారాన్ని అవి ఎలా వెతుకుంటాయి అనే విషయాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తుంది.ముఖ్యంగా పగడపు దీవుల్లో చేపలు ఎలా జీవనాన్ని కొనసాగిస్తాయి, అవి ఉండే ప్రాంతం నుండి చేపల్ని వేరు చేస్తే వాటి బ్రెయిన్ ఎలా పనిచేస్తుందనే విషయాలు తెలుసుకునేందుకు పరిశోధనలు చేసినట్లు ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.ఆ చేప అలా డ్రైవ్ చేయడానికి ముందుగా ఆ గోల్డ్ ఫిష్ కు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు.