ప్రేమకు, వయస్సుకు సంబంధం లేదంటారు.ప్రేమ అనేది చనిపోయేవరకు ప్రతిఒక్కరిలో ఉంటుంది.
మనకు నచ్చిన వ్యక్తులను చూసినప్పుడు ప్రేమ పుడుతుంది.అలాగే మన తల్లిదండ్రులతో పాటు జీవిత భాగస్వామిపై కూడా ప్రేమ ఉంటుంది.
వృద్ధాప్యం( Old Age ) వచ్చిన తర్వాత దంపతుల మధ్య ప్రేమ తగ్గిపోతుందని అందరూ భావిస్తూ ఉంటారు.కానీ కొంతమందిని చూస్తే మాత్రం అది తప్పు అని రుజువు అవుతూ ఉంటుంది.
వృద్దాప్యంలో కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉంటారు.ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చాటుకుంటూ ఉంటారు.

ఇటీవల వృద్ధ దంపతుల( Old Couple ) వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో వృద్ద దంపతులను చూస్తే ముచ్చటేస్తుంది.భారీ వర్షం( Rain ) పడుతుండగా ఈ జంట సరదాగా గడిపేందుకు బయటకు వచ్చింది.ఇద్దరు గొడుగేసుకుని బయటకు వచ్చి పానీపూరి బండి దగ్గరకు వెళ్లారు.
అక్కడ ఇద్దరూ కలిసి పానీపూరి( Panipuri ) తిన్నారు.వృద్దుడికి పళ్లు లేకపోయినా బోసి నోటితో మెల్లగా పానీపూరి నములుతున్నాడు.
పానీపూరి అమ్ముతున్న వ్యక్తి కూడా వృద్దుడే.అతడిని అడిగి పానీ వేయించుకుని మరీ తాగుతున్నాడు.

కాజల్ 11 అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ వీడియోను షేర్ చేశారు.దీంతో ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని కామెంట్స్ వస్తున్నాయి.ఈ వీడియోలో వృద్దురాలు నిండుగా చీర కట్టుకుని ఉండగా.వృద్దుడు ప్యాంట్ చొక్కా వేసుకుని ఉన్నాడు.వర్షంలో వచ్చి పానీపూరి తింటున్న ఈ జంటను చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ప్రేమ( Love ) అంటే ఇది కదా అంటూ మురిసిపోతున్నారు.
ఈ వీడియోను చూస్తే జీవితాన్ని ఎంత ఆనందంగా గడుపుతున్నారో అర్థం అవుతుందని చెబుతున్నారు.వారిద్దరూ ఇలాగే హ్యాపీగా ఉండాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియోకు లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.సూపర్ అంటూ అందరూ కామెంట్స్ పెడుతున్నారు.







