కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ చేసిన అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.
త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయనే ఆర్టీసీ కార్మికులు గుర్తుకు వచ్చారా అని పొంగులేటి ప్రశ్నించారు.సర్వేలు చూసి భయంతో మీకు రైతులు గుర్తుకు వస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







