వీడియో వైరల్: అమ్మాయికి చింపాంజీ ప్రపోజ్.. చివరికి..?

చింపాజీలకు, మనుషులకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది.మనుషులు చేసే పనులను అచ్చం అలాగే చేస్తుంటాయి.

అంతేకాదు అవి చేసే చేష్టలు మనుషుల్లాగే ఉంటాయి.కోతులు, చింపాజీలు చేసే పనులు చాలా ఫన్నీగా ఉంటూ నవ్వులు తెప్పిస్తుంటాయి.

ఇక కొన్నిసార్లు అవి చేసే పనులు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.కోతులు, చింపాజీల ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ప్రస్తుతం అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఓ చింపాంజీ చేసిన పనులు అందరినీ ఆశ్చర్యానికి గురించేస్తోంది.

Advertisement

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.చింపాంజీ ఓ అమ్మాయికి ముద్దులు పెట్టి ప్రపోజ్ చేసింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ లో జరిగింది.

బ్యాంకాక్ లోని సఫారీలో ఓ చింపాంజీ ప్రత్యేకంగా కనిపించింది.ప్యాంట్ వేసుకొని అక్కడి తిరుగుతోంది.

అక్కడ ఫొటోషూట్ కోసం వచ్చిన ఓ అమ్మాయి చింపాంజీతో కలిసి ఊయల ఊగుతూ ఉంటుంది.ఆ సమయంలో చింపాంజీ ఆమెను చూసి టెమ్ట్ అయిపోతుంది.

ఒకప్పుడు చదువులో ఫెయిల్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
రన్నింగ్ ట్రైన్ లో ప్రత్యక్షమైన పాము.. దెబ్బకి ప్రయాణికులు?

ఆమె భుజంపై చేయి వేసి హగ్ చేసుకుంటుంది.ఆ తర్వాత, ముఖంపై ముద్దులు పెట్టింది.

Advertisement

చేతికి ముద్దులు పెడుతూ ప్రపోజ్ చేసినట్లు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుంది.దీంతో ఆ అమ్మాయి తెగ సిగ్గుపడిపోయింది.

సౌమియా చంద్రశేఖరన్ అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఇటీవల బ్యాంకాక్ లో సఫారీ వరల్డ్ ని సందర్శించారు.అక్కడ చింపాంజీతో ఫొటోషూట్ చేశారు.

ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా అది వైరల్ అయ్యింది.ఈ వీడియోకు కొన్ని మిలియన్ల వ్యూస్, అలాగే లక్షలలో లైక్ లు ఈ వీడియోకి వచ్చాయి.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు