శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.జాన్వీ కపూర్ తో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించినా చాలామంది స్టార్ హీరోలు ఆశ పడుతున్నారు.
అలా ఆశ పడుతున్న హీరోలలో బాలీవుడ్ సీనియర్ హీరోలు సైతం ఉన్నారు.అయితే అలా ఆశ పడే హీరోలకు జాన్వీ కపూర్ భారీ షాకిచ్చింది.
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలతో నటించనని జాన్వీ కపూర్ కామెంట్లు చేశారు.
షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లతో కలిసి తాను నటించనని జాన్వీ కపూర్ అన్నారు.
వయస్సు డిఫరెన్స్ ఎక్కువగా ఉండటం వల్లే ఆ హీరోలతో కలిసి నటించడానికి ఇష్టపడటం లేదని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు.పరోక్షంగా ముసలి హీరోలతో కలిసి నటించడం ఇష్టం లేదని జాన్వీ కపూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆ హీరోలతో నటిస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం కష్టమని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు.
రణ్ బీర్ కపూర్, వరుణ్ ధావన్, జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి నటించడం నాకు ఇష్టమని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు.గుడ్ లక్ జెర్రీ బిలో యావరేజ్ రిజల్ట్ ను అందుకోవడంతో భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవాలన్న జాన్వీ కపూర్ కల అయితే నెరవెరలేదనే చెప్పాలి.అయితే తర్వాత సినిమాలు కూడా భారీ సినిమాలు కావడంతో జాన్వీ ఈ ప్రాజెక్ట్ లతో స్టార్ స్టేటస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
జాన్వీ తెలుగు హీరోలంటే ఇష్టమని చెబుతున్నా ఇప్పటికే చాలా తెలుగు సినిమాలను రిజెక్ట్ చేశారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.సినిమాసినిమాకు జాన్వీ కపూర్ రేంజ్ పెరుగుతోంది.జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది.