వైరల్ వీడియో: 400 ఏళ్ల చెట్టు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ ఇల్లు తునాతునకలు..

యునిస్ తుఫాను బ్రిటన్ లోని అనేక ప్రాంతాలలో విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.భయంకరమైన ఈ తుఫాను కారణంగా వేలాది గృహాలకు ఎలక్ట్రిసిటీ కట్టయ్యింది.

చాలా కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.భవనాలు కూడా కుప్పకూలిపోయాయి.

దీంతో అక్కడి ప్రజలకు బతకడం చాలా కష్టం గా మారిపోయింది.బలమైన గాలులు, వర్షం వల్ల యూకేలోని చాలా మంది ప్రజలు ప్రభావితం అవుతున్నారు.

అయితే ఈ తుఫాను ధాటికి 400 సంవత్సరాల నాటి ఓ సింధూర వృక్షం నేలకూలింది.దీని పక్కనే ఒక పెద్ద ఇల్లు ఉండగా అది తునాతునకలు అయింది.

Advertisement

ఒక లగ్జరీ కారు కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇది చూసిన నెటిజన్లు అయ్యో పాపం అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.తుఫాను వల్ల ఇల్లు ధ్వంసమైతే ఆ బాధ వర్ణనాతీతం అని చెప్పచ్చు.

ఐల్ ఆఫ్ వైట్‌లో గంటకు 122 మైళ్ల వేగంతో వీచిన గాలుల వల్ల ఈ 400 ఏళ్ల నాటి చెట్టు నేలకూలిందని స్థానిక మీడియా తెలుపుతోంది.గుడ్ ఫ్యామిలీ అనే కుటుంబం ఈ ఇంటిలో నివసిస్తున్నారు.

అయితే చెట్టు పడినప్పుడు వారు ఇంట్లో లేరు.దాని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ చెట్టు వారి పైకప్పు గుండా వెళ్లి వారికి భారీగా ఆస్తి నష్టం చేకూర్చింది.

Advertisement

స్వెన్ అనే ఇంటి యజమాని మాట్లాడుతూ.తన తల్లిదండ్రుల ఇంట్లో పని చేస్తున్నప్పుడు భారీ చప్పుడు వినిపించిందని చెప్పాడు.ఆ శబ్ధం ఇంటిలోని పలు గదుల్లోంచి వినిపించిందని వివరించాడు.

అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఊపిరి పీల్చుకున్నాడు.ఆ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, చెట్టు పడిపోయినప్పుడు తాను కాన్ఫరెన్స్ కాల్‌లో ఉన్నానని స్వెన్ తెలిపాడు.

ఈ ఘటనలో ఇల్లు మాత్రమే కాదు స్వెన్ తల్లి కారు కూడా చెట్టు దాటికి బాగా డామేజ్ అయ్యింది.ఈ అనూహ్య ప్రమాదంతో తన తండ్రికి కన్నీళ్లు వచ్చాయని స్వెన్ చెప్పాడు.

వైరల్ అవుతున్న వీడియోలో ఇంటి పై కప్పుతో పాటు లోపల ఉన్న సామాన్లు మొత్తం పాడయినట్లు తెలుస్తోంది.ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు