మధ్యప్రదేశ్‌లోని( Madhya Pradesh ) విదిషాలో ఓ వివాహ వేడుకలో విషాద సంఘటన చోటు చేసుకుంది.నృత్యం చేస్తూ ఓ 20 ఏళ్ల యువతి హఠాత్తుగా గుండెపోటుతో( Heart Attack ) మరణించింది.
ఈ విషాదకర సంఘటన ఆదివారం వెలుగు చూసింది.సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్( Viral Video ) అవుతుండటంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఘటాకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.

ఈ సంఘటన విదిషాలోని ఓ రిసార్ట్‌లో జరుగుతున్న ‘హల్దీ’ వేడుకలో చోటుచేసుకుంది.మృతురాలిని ఇండోర్‌కు చెందిన పరిణిత జైన్‌గా( Parinita Jain ) గుర్తించారు.ఆమె తన సోదరి వివాహానికి హాజరయ్యేందుకు విదిషాకు వచ్చింది.
వేడుకలో బాలీవుడ్ పాటకు స్టేజ్‌పై నృత్యం చేస్తుండగా, స్టేజి పైనేఒక్కసారిగా అకస్మాత్తుగా కుప్పకూలింది.దానితో అక్కడున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించారు.
వృత్తిరీత్యా వైద్యులైన కుటుంబ సభ్యులు ఆమెకు CPR (కార్డియోపల్మనరీ రిససిటేషన్) అందించినప్పటికీ ఆమెకు ఎలాంటి స్పందన లేకపోయింది.వెంటనే పరిణితను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

పరిణిత జైన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్‌గా తన తల్లిదండ్రులతో ఇండోర్‌లోని దక్షిణ తుకోగంజ్ ప్రాంతంలో నివసిస్తోంది.ఇకపోతే, తెలిసిన సమాచారం మేరకు.పరిణిత తమ్ముడు కూడా 12 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు.
ఇక ఈ మధ్యకాలంలో వివాహ వేడుకలలో నృత్యం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.ఈ సంఘటనలు వినడం మనకు ఆశ్చర్యంగా కనిపించినప్పటికీ, ఇవి శారీరక ఆరోగ్యంపై సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తున్నాయి.
ఇలాంటి వాటి నుండి మరింత అప్రమత్తంగా ఉండేందుకు సూచనల కోసం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.







