సాధారణంగా ఎవరైనా మరణిస్తే వారికి అంత్యక్రియల నిర్వహించి పూర్తి కార్యక్రమాలను పూర్తిచేస్తారు.ఇలా అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించే తరుణంలో శవం పాడే పై నుంచి లేసి కూర్చున్న సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
ఇలా పాడే నుంచి లేచి కూర్చున్న వ్యక్తి రెండు రోజులు గడవక ముందే మళ్ళీ మరణించాడు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలో ఒక వ్యక్తి పాడపై నుంచి లేచి కూర్చున్నాడు.
ఈ సంఘటన దర్యాప్తులో భాగంగా వీఆర్వో ఇచ్చిన సమాచారం మేరకు మదనపల్లి మండలంలోని కట్టుబావి గ్రామంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక చెట్టు నీడ కింద రెండు రోజులుగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.ఇది గమనించిన అక్కడి గ్రామస్తులు వెంటనే విఆర్ఓ నాగరాజుకు, గ్రామ కార్యదర్శి మనోహర్ కు విషయాన్ని తెలిపారు.
ఈ సమాచారం తెలుసుకున్న వారు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకొని ఆ వ్యక్తిని పరిశీలన చేయగా అతడిలో ఎలాంటి చలనం లేకపోవడం అలాగే అతడికి ఊపిరి అందకపోవడంతో మరణించాడని అందరు అనుకున్నారు.

ఇక వెంటనే అతనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.ఊరికి సమీపంలో ఒక ప్రాంతంలో గుంతను తొవ్వించిన తర్వాత పాడెపై మోసికొని వెళుతూ ఉండగా ఆ వ్యక్తి సడెన్ గా లేచి కూర్చున్నాడు.దీనితో వెంటనే అతడిని వాహనంలో మదనపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందచేసారు.
అయితే తాజాగా ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్య అధికారులు నిర్ధారణ చేశారు.అతడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడో, అతడు అక్కడ ఎందుకు ఆ చెట్టు కింద అలా ఎందుకు పడిపోయాడు అన్న వివరాలు ఏమి తెలియడం లేదని అధికారులు తెలుపుతున్నారు.