సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు నిత్యం హల్ చల్ చేస్తూ ఉంటాయి.అందులో ఎక్కువగా చిన్నపిల్లలకు చెందిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి.
ఎందుకంటే వాళ్లు చేసే అల్లరి చేష్టలు, ముద్దులొలికే మాటలు, వారి క్యూట్నెస్ అన్నీ చాలా నవ్వు తెప్పిస్తుంటాయి.అలాంటి రకానికి చెందిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
సాధారణంగా చిన్నారులు ఎప్పుడూ పిడికిలి పట్టుకుని ఉంటారు.శిశువుల( infants ) నుంచి కొన్ని నెలల వయస్సు వచ్చేంత వరకు వాళ్లు చేతులు అలా ముడుచుకుని ఉంటారు.
దాంతో పెద్ద వాళ్లు వారి వేళ్లను చిన్నారుల పిడికితో పట్టుకునేలా చేసి తెగ సంబరపడిపోతూ వుంటారు.అలా పట్టుకున్నప్పుడు వాళ్లు పట్టు ఏమిటో తెలిసి వస్తుంది.

అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోని చూస్తే, ఓ నవజాత శిశువు కూడా అలాగే తన పిడికిలితో డాక్టర్ గ్లౌజుని గట్టిగా పట్టుకున్నాడు.ఆ డాక్టర్ ఎంత విడిపించుకుందామని యత్నించినప్పటికీ వదల్లేదు.ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను తెగ మెప్పిస్తోంది.వికాస్ కుమార్ ( Vikas Kumar )అనే డాక్టర్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియో పోస్టు చేయగా 24 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
రోజులు కూడా నిండని ఆ పసిబిడ్డను పరీక్షించేందుకు డాక్టర్ అక్కడికి వెళ్లాడు.తనను పరీక్షించేందుకు వచ్చిన డాక్టర్ చేతిని ఆ శిశువు గట్టిగా పట్టేసుకున్నాడు.ఎడమ చేతి చూపుడు వేలి గ్లోవ్స్ ను గట్టిగా పట్టుకుని ఎంతకీ వదల్లేదు.

ఈ వీడియోను పోస్టు చేసిన డాక్టర్ వికాస్ కుమార్.అరే యార్ అకేలే మత్ ఛోడో ముజే (హే మ్యాన్.నన్ను ఒంటరిగా వదిలి పెట్టి వెళ్లకు) అనే క్యాప్షన్ ఆ వీడియోకి ఇవ్వడం కొసమెరుపు.24 సెకన్ల నిడివిగల ఈ వీడియోని డాక్టర్ వికాస్ కుమార్ జూన్ 29 వ తేదీన మధ్యాహ్నం 3.15 గంటలకు పోస్టు చేయగా.అత్యంత తక్కువకాలంలోనే వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన నెటిజన్ ఒకరు ఆ శిశువును బాహుబలితో పోల్చారు.‘నాకు బాహుబలి సీన్ గుర్తుకు వచ్చింది.ఆ చిన్నారి చేతుల్లో అంత బలం ఉంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు.‘నాకు అలాంటి అనుభవమే ఎదురైంది.నాకు కొడుకు పుట్టిన ఒక రోజు తర్వాత అతడిని NICUలో ఉంచారు.
అప్పుడు వాడు ఆక్సిమీటర్ ను వదలకుండా గట్టిగా ఇలాగే పట్టుకున్నాడు’ అని ఓ యూజర్ తన మధుర జ్ఞాపకాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.







