ఢిల్లీలో మోదీ అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశం..!

ఢిల్లీలో బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇంఛార్జ్ లతో పాటు నేషనల్ జనరల్ సెక్రటరీలు, ఉపాధ్యక్షులతో ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్ లు ఈ భేటీ నిర్వహించారు.

 Important Meeting Of Bjp Under The Chairmanship Of Modi In Delhi..!-TeluguStop.com

పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలపై ప్రధానంగా ఈ భేటీలో చర్చిస్తున్నారు.అదేవిధంగా 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చిస్తున్నారని తెలుస్తోంది.

దాంతో పాటు మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ఆయా రాష్ట్రాలలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను నివేదిక రూపంలో నేతలు అధిష్టానానికి అందించనున్నారు.ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.

అనంతరం ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర అధ్యక్షులకు, నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube