వైరల్: పొట్ట తగ్గించుకోడానికి అంత కష్టపడాలా? ఇలా చేస్తే సరిపాయె!

మనిషికి ఒంపు సోంపు బాగున్నంతవరకు పర్వాలేదు గానీ, ఒక్కసారి శారీరక మార్పులు వచ్చాయంటే ఆ బాధ బయటకి చెప్పుకోవడం కష్టం.

అప్పటి వరకు సరిపోయిన బట్టలు ఒక్కసారిగా టైట్ అయిపోతాయి.

పొట్ట( Belly fat ) గానీ బయటకి తన్నిందంటే చాలామంది మానసికంగా కుంగిపోతుంటారు.ఇక పెళ్లికాని ప్రసాదులైతే వారి బాధను తీర్చడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు.

వారి పొట్టలను చూసిన కన్యలు అంకుల్స్ అంటూ రిజక్ట్ చేస్తుంటారు.ఇక చేసేదేముంది, జిమ్ములకెళ్లి కుస్తీలు పడుతుంటారు మగమహారాజులు.

అయితే, ఈ సమస్యలు అనేవి అమ్మాయిలకు ఉంటాయి లెండి.ఇప్పుడు చాలా మంది పొట్ట తగ్గించుకోడానికి పడరాని పాట్లు పడుతున్నారు.పొట్ట దగ్గర కొవ్వు తగ్గించుకోడానికి జిమ్‌లలో రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చెబుతుంటారు.

Advertisement

ఈ విషయంలో చాలామంది చాలా స్ట్రిక్ట్‌గా డైట్ పాటిస్తారు.పొట్ట రావడం అనేది ఇపుడు సాధారణ సమస్యగా మారడంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని చూసిన కొందరు కొత్త కొత్త డ్రింక్స్‌, ఫుడ్స్ మార్కెట్లోకి ప్రవేశపెడుతూ బాగానే యాపారం చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఓ వీడియో చాలా ఫన్నీగా సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ అవుతోంది.అవును, పొట్ట తగ్గించుకోడానికి ఆ మెథడ్స్ అన్నింటితో పాటు మరో ఎక్సర్‌సైజ్‌నీ కనిపెట్టాడో జిమ్‌ ట్రైనర్.రొట్టెలు చేసుకున్న కర్రను పొట్టపై రుద్దితే పొట్ట తగ్గిపోతుందని చెప్పాడు.

ఇంకేముంది కట్ చేస్తే ట్రైనింగ్ సెంటర్‌కి వచ్చే ఆడవాళ్లు, మగవాళ్ళు తలా ఓ రొట్టెల కర్ర తెచ్చుకున్నారు.అందరూ వరుసలో నిలబడి డ్యాన్స్( Dance ) చేస్తూ పొట్టపై రొట్టెల క్రరతో రుద్దుకున్నారు.

ఓ వైపు నవ్వుకుంటూనే సదరు ఎక్సర్‌సైజ్ చేసేస్తున్నారు చూడండి.ఈ వీడియోని ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేయగా కాసేపటికే వైరల్ అయిపోయింది.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?

పొట్ట ఇలా కూడా తగ్గించుకోవచ్చా అని నెటిజన్లు నోళ్లు వెళ్ళబెట్టి మరీ ఆ వీడియోని చూసేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు