వైరల్: సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఏం చేస్తున్నాడో చూడండి... మోడల్ అంట వీడు!

ఓ వైపు స్మార్ట్ ఫోన్స్ చవకగా దొరకడం కావచ్చు… మరోవైపు ఇంటర్‌నెట్ టారిఫ్( Internet Tariff ) ధరలు కూడా చవక కావడం వల్లనేమోగాని సోషల్ మీడియా అనేది సామాన్యులకు కూడా బాగా అలవాటు అయిపోయింది.ఈ క్రమంలో రోజుకొక సెలిబ్రిటీ పుట్టుకొస్తున్నాడు.

 Viral: See What He Is Doing To Become Famous On Social Media He Is A Model ,soci-TeluguStop.com

రోజుకి కాదు… క్షణానికొక సెలిబ్రటీ అని చెప్పుకుంటే బావుంటుందేమో.ఫేమస్ అవ్వాలనే కోరికతో చాలామంది చిన్నాపెద్దా తేడాలేకుండా ఇక్కడ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో వారు ఫేమస్ అవుతున్నారో లేదో తెలియదు కానీ నెట్టింట మాత్రం తెగ ట్రోల్ అవుతుంటారు.ఈ క్రమంలో కావలసినంత ఫ్యాన్ కూడా దొరుకుతుంది.

అదేవిధంగా ఫేమస్ అవుదామనే ఓ బాలుడు చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.‘మోడల్ మోడల్’( model model song ) అనే పాటకు స్టెప్పులేస్తూ ఆ బాలుడు చేసిన మోడల్ డ్యాన్స్ వీడియో నెటిజన్లకి కితకితలు పెడుతోంది.

దాంతో ఈ వీడియోలోని బాలుడిని నెటిజన్లు ‘మోడల్ బాయ్’( Model boy ) అంటూ చెట్టెక్కిస్తున్నారు.వైరల్ అవుతున్న ఈ వీడియోని ఒకసారి పరిశీలిస్తే మొదటిగా టీషర్ట్ ధరించి ఉన్న అతను తర్వాత దానిపై ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకుంటాడు.

మళ్లీ దానిపైనే మరో జెర్కిన్ వేసుకుంటాడు.ఈ క్రమంలో మొదటి నుంచి ఒక కళ్లజోడుని కలిగివున్న ఆ బాలుడు దానిపైనే మరో కళ్లజోళ్లను కూడా పెట్టుకుంటాడు.దాంతో మనకి నవ్వు రాక తప్పదనుకోండి.

దీనికి సంబంధించిన వీడియో బాబాయ్ మీమ్స్( Internet Tariff ) అనే ఇన్‌స్టాగ్రామ్ నుంచి ‘టాగ్ సచ్ మోడల్’ క్యాప్షన్‌తో షేర్ కావడంతో వెలుగు చూసింది.దీన్ని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.ఈ ‘మోడల్ బాయ్’ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 29 లక్షలకు పైగా వీక్షణలు రావడం విశేషం.

అలాగే 1 లక్షా 98వేలకు పైగా లైకులు రావడం చూడవచ్చు.నెటిజన్లు అయితే ‘ఎవడ్రా నువ్వు ఇంత టాలెంట్‌ పెట్టుకొని అసలు అలా ఎలా ఉండగలుగుతున్నావు? అని కామెంట్ చేస్తే, ‘మార్కెట్‌లోకి కొత్త మోడల్ వచ్చేశాడ్రా బాబు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube