వైరల్: ఈ కుక్క దొంగతనం చూసి విస్తుపోతున్న నెటిజన్లు!

ఈ భూమిపైన వున్న జంతువులలో మనుషులకు ఫ్రెండ్లీ పెట్స్( Friendly pets ) ఏవంటే ఠక్కున గుర్తొచ్చేవి శునకాలు.అందుకే వాటిని మనలో అనేకమంది తమ ఇళ్లల్లో పెంచుకుంటూ వుంటారు.

 Viral Netizens Are Shocked By The Theft Of This Dog , Viral Video, Viral News, D-TeluguStop.com

ఈ క్రమంలో వాటిని చాలా ముద్దు చేస్తూ వుంటారు.ఇక కుక్కలు( dogs ) కూడా తమ యజమానులకు ఎంతో కృతజ్ఞతగా ఉంటాయి.

ఓ రకంగా చెప్పాలంటే మనుషులకంటే ఎక్కువ ప్రేమను అందిస్తుంటాయి.ఈ క్రమంలో అవి చేసే అల్లరి అంతాఇంతా కాదు.

ఆ అల్లరికి యజమానులు, కుటుంబ సభ్యులు తమ తమ బాధలను కూడా మర్చిపోయి రిఫ్రెష్ అవుతూ వుంటారు.

ఇక పెంపుడు శునకాలు కేవలం తినడమే కాకుండా కొన్ని కొన్ని పనులలో కూడా సాయపడుతూ ఉంటాయి.

అలా అవి చేసిన కొన్ని పనులు చాలా క్యూట్ గా అనిపిస్తూ ఉంటాయి.ఇక్కడ కూడా అటువంటి ఓ సంఘటనే జరిగింది.వైరల్ అవుతున్న వీడియోలో ఓ పెంపుడు కున్న ఓ కోడిని చాలా తెలివిగా దొంగతనం చేయడం గమనించవచ్చు.అయితే ఆ దొంగతనం దానికోసమా లేక దాని యజమాని కోసమా అనే విషయం మాత్రం తెలియదుగాని సదరు వీడియో మాత్రం నెటిజన్ల చంకల్లో కితకితలు పెడుతుంది.

కాగా దీనికి సంబంధించిన వీడియో ఆడోరె పంకజ్( Audrey Pankaj ) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ కావడం వలన వెలుగు చూసింది.సదరు వీడియోకి ఐ విల్ ఈట్ చికెన్ టుడే అనే క్యాప్షన్‌ ని మనం గమనించవచ్చు.కాగా ఈ వీడియోకి ఇప్పటివరకు దాదాపు 2 లక్షా 25 వేల లైకులు, 29 లక్షలకు పైగా వీక్షణలు రావడం కొసమెరుపు.ఇక ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు రకరకాల కామెట్స్ చేస్తున్నారు.‘నేను ఆ బంగారాన్ని దత్తత తీసుకుంటాను’ ఒక యూజర్ కామెంట్ చేయగా, మరో యూజర్ ‘ఇలాంటి పెట్ నాకు కావాలి.ఎవరైనా సహాయం చేయగలరు’ అని కామెంట్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube