వైరల్: పఠాన్ పాటకి విద్యార్థులతో కలిసి ప్రొఫెసర్స్ స్టైప్పులు... మతిపోతుంది చూడండి!

పఠాన్.చాన్నాళ్ల విరామం తరువాత బాలీవుడ్ కి ఊరటనిచ్చిన సినిమా అని చెప్పుకోవచ్చు.

గత కొన్ని సంవత్సరాల నుండి గడ్డుకాలాన్ని అనుభవించిన బాలీవుడ్ కి మంచి ఊపు ఇచ్చిన సినిమా కావడంతో బాలీవుడ్ జనాలు (నార్త్ జనాలు) ఈ సినిమాను ఎగబడి మరీ చూసారు.బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌, అందాల తార దీపికా పదుకొనె నటించిన ప‌ఠాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వ‌సూళ్ల‌ను రాబట్టింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని పాట‌ల‌కు సోష‌ల్ మీడియాలో ప‌లువురు క్రేజీ స్టెప్స్‌తో సంద‌డి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఢిల్లీ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని జీస‌స్ అండ్ మేరీ కాలేజ్‌లోని కామ‌ర్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెస‌ర్లు ప‌ఠాన్‌లోని "ఝూమే జో ప‌ఠాన్ సాంగ్‌"కు స్టూడెంట్స్‌తో క‌లిసి దిమ్మతిరిగే రీతిలో స్టెప్స్ చేసి ఆహుతులను అలరిస్తున్నారు.ఈ వైరల్ వీడియోను జేఎంసీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామ‌ర్స్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా వెలుగు చూసింది.ఇక్కడ కాలేజ్ యాజమాన్యం మొత్తం ఝూమే జో ప‌ఠాన్ సాంగ్‌కు స్టెప్పులేస్తుండ‌టం గమనించవచ్చు.

Advertisement

ఈ క్లిప్ మొద‌ల‌వ‌గానే క్ష‌ణాల్లోనే శారీస్‌లో ముస్తాబైన ప్రొఫెస‌ర్లు స్టూడెంట్స్‌తో క‌లిసి అందమైన స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టారు.హుషారైన సాంగ్‌కు ప్రొఫెస‌ర్లు కూడా హుషారుగా కాలు కడపడంతో స్టూడెంట్స్ ఇక ఊరుకుంటారా? వాళ్ళు కూడా దుమ్ముదులిపేసారు.ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసిన‌ప్ప‌టి నుంచి ఇప్పటివరకు 50 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ రావడం కొసమెరుపు.

ప్రొఫెస‌ర్ల డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో ఇన్‌స్టాగ్రాం యూజ‌ర్లు ఫిదా అయ్యారు.ఇలాంటి ప్రొఫెస‌ర్లు అవ‌స‌ర‌మ‌ని కొంద‌రు యూజ‌ర్లు కోరుకోగా, క్రేజీ అని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు