అరుదైన వ్యాధితో బాధ పడుతున్న వంటలక్క.. త్వరగా కోలుకోవాలంటూ?

కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన ప్రేమీ విశ్వనాథ్ అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారని తెలుస్తోంది.ఈ సీరియల్ ద్వారా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రేమీ విశ్వనాథ్ ప్రస్తుతం సినిమాలలో కూడా వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

 Premi Vishwanath Rare Disease Details Here Goes Viral In Social Media , Naga Cha-TeluguStop.com

కార్తీకదీపం సీరియల్ కోసం ఉపయోగించిన బ్లాక్ మేకప్ వల్ల ప్రేమీ విశ్వనాథ్ ఈ వ్యాధి బారిన పడినట్టు తెలుస్తోంది.

బ్లాక్ మేకప్ వల్ల ప్రేమీ విశ్వనాథ్ ఫేస్ పై మచ్చలు వచ్చాయని సమస్య పరిష్కారం కోసం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ వార్తలకు సంబంధించి ప్రేమీ విశ్వనాథ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.ప్రస్తుతం కస్టడీ సినిమాలో ప్రేమీ విశ్వనాథ్ కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం ఆమెకు మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

కస్టడీ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా చైతన్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు.త్వరలో కార్తీకదీపం సీరియల్ కు సీక్వెల్ రానుండగా కథ, కథనాలు కొత్తగా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.ప్రేమీ విశ్వనాథ్ రెమ్యునరేషన్ కూడా ఊహించని రేంజ్ లో ఉండగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ప్రేమీ విశ్వనాథ్ తక్కువ సంఖ్యలో ప్రాజెక్ట్ లకు ఓకే చెబుతున్నారు.

కార్తీకదీపం సీరియల్ నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించింది.స్టార్ మా ఛానల్ నంబర్ వన్ పొజిషన్ కు రావడానికి ఈ సీరియల్ కారణమని చాలామంది భావిస్తారు.అనారోగ్య సమస్యల నుంచి ప్రేమీ విశ్వనాథ్ కోలుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు.ప్రేమీ విశ్వనాథ్ కు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube