దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణ వేగవంతమైంది.ఈ కుంభకోణంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా చుట్టు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే కాకుండా మరో కేసులో సిసోడియా అరెస్ట్ కు రంగం సిద్ధం అయినట్లు సమాచారం.ఫీడ్ బ్యాక్ యూనిట్ ముసుగులో రాజకీయ గూఢచర్యం చేశారని మనీశ్ సిసోడియాపై ఆరోపణలు వస్తున్నాయి.
ఈ మేరకు దర్యాప్తు జరిపించాల్సిందని కేంద్ర హోంశాఖకు ఎల్జీ సిఫార్సు చేసింది.కాగా లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర హోంశాఖ దర్యాప్తు జరపాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.